టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ బీచ్ లో చిల్ అవుతూ కనిపించారు . రామ్ చరణ్ వైఫ్ ఉపాసనతో పాటు సముద్ర తీరంలో ఆహ్లాదంగా గడుపుతున్న ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది. ఉపాసనతో రకుల్ షార్ట్ వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసినట్లున్నారు. ఎంట్రప్రెన్యూర్ అయిన ఉపాసన, టాలీవుడ్ సెలెబ్స్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. 


బి పాజిటివ్ పేరుతో ఆమె ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజిన్ నడుపుతున్నారు. దాని కోసం టాలీవుడ్ లోనే కాకుండగా బాలీవుడ్ నుండి స్టార్స్ ని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. కత్రినా, సల్మాన్ వంటి స్టార్స్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. ఇక హెల్తీ ఫుడ్, హ్యాబిట్స్ పై ఉపాసన ప్రత్యేక వీడియోలు కూడా చేస్తారు. రకుల్ కూడా ఉపాసనతో కలిసి వంట చేశారు. 
హెల్తీ రోటీలు ఎలా చేయాలో ఆమె చేసి చూపించారు. 

ఇక రకుల్ బాలీవుడ్ లో బిజీ అయ్యాక, టాలీవుడ్ లో సినిమాలు తగ్గించారు. ఆమె లేటెస్ట్ మూవీ చెక్ అనుకున్నంత విజయం సాధించలేదు. వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించిన ఓ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇక్కడ సినిమాలు చేస్తున్నా లేకున్నా... ఇక్కడి వారితో స్నేహం మైంటైన్ చేస్తుంది. మంచు లక్ష్మీ, రానా, సమంత అలాగే ఉపాసన రకుల్ కి బెస్ట్ ఫ్రెండ్స్.