స్పైడర్ లాంటి భారీ చిత్రంలో హిరోయిన్ గా నటించిన రకుల్ దీంతోపాటు ఇటీవల కొన్ని ఫ్లాఫులను ఎదుర్కొంది. అయినప్పటికీ టాప్ హీరోయిన్లలో ఒకరిగా అయితే తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే రాబోయే సినిమాలపై ఈమెకు భారీ ఆశలే ఉన్నాయి. చేతిలో ఉన్నది పెద్ద సినిమాలే కావడంతో.. వాటిలో ఏది హిట్టైనా తన స్థానానికి డోకాలేదన్నట్టుగా ఉంది రకుల్.
 

ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో, రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది రకుల్. తెలుగు సినిమాలైతే ఏవీ ఈమె చేతిలో లేవు. మూవీ మేకర్ల చూపు తన మీదకు మళ్లించుకునే ప్రయత్నంలోనే రకుల్ రెచ్చిపోతోందేమో గానీ మాక్సిమ్ కవర్ పేజీ కోసం బోల్డ్ గా పోజిచ్చింది.

 

ఫ్లాపులు చవిచూసినా ఇలా మరో రకంగా తన ఉనికిని చాటుతోంది ఈ పంజాబీ భామ. మ్యాగ్జిమ్ పత్రిక తాజా కవర్ పేజీపై ఆమె ముందెన్నడూ లేనంత సెక్సీగా దర్శనమిచ్చింది. ఈ ఫొటో చూసిన వారి పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకుల్ గ్లామర్ డోసును పెంచేసిందని స్పష్టం అవుతోంది. మరి మూవీ మేకర్స్ చూస్తున్నారా...