MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • తారక్‌కు ఒక స్టోరీ చెప్పాను.. కానీ.! ఆ రోజు అలా జరగకపోయి ఉంటే..

తారక్‌కు ఒక స్టోరీ చెప్పాను.. కానీ.! ఆ రోజు అలా జరగకపోయి ఉంటే..

Jr NTR: దర్శకుడు అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా అవకాశం మిస్సవడం, కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో తనకెలా జీవితాన్నిచ్చారో వివరించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టులు, అన్ని స్టార్ హీరోలతో పనిచేయాలనే కోరిక లాంటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 20 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసక్తికర విషయాలు..
Image Credit : Anil Ravipudi\Twitter

ఆసక్తికర విషయాలు..

'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, స్టార్ హీరోలతో అనుభవాలు, డ్రీమ్ ప్రాజెక్టులపై కీలక విషయాలు పంచుకున్నాడు. తన కెరీర్‌కు పునాది వేసిన పటాస్ సినిమా.. కళ్యాణ్ రామ్‌ తనపై పెట్టి నమ్మకాన్ని గుర్తు చేసుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పటాస్ సినిమా తన అడ్రస్..
Image Credit : youtube/@Shinescreenscinema

పటాస్ సినిమా తన అడ్రస్..

పటాస్ సినిమా తన అడ్రస్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, తనను నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చారని తెలిపాడు. కళ్యాణ్ రామ్ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఈరోజు సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు లాంటి సినిమాలు ఉండేవి కాదని, అందుకే కళ్యాణ్ రామ్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అనిల్ స్పష్టం చేశాడు.

35
తారక్‌కు కథ చెప్పా..
Image Credit : youtube/@Shinescreenscinema

తారక్‌కు కథ చెప్పా..

రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ను కలిసి ఓ పాయింట్ చెప్పాను. అది ఎన్టీఆర్‌కు బాగా నచ్చి, గంటన్నర నేరేషన్ చెప్పమన్నారు. అయితే అప్పుడు సమయం లేకపోవడంతో ఆ అవకాశం కోల్పోవాల్సి వచ్చిందని అన్నాడు. అదే సమయంలో బాబీ దర్శకత్వంలో 'జై లవకుశ'కు ఎన్టీఆర్ ఓకే చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మంచి కథతో వెళితే ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

45
 స్టార్ హీరోలతో సినిమాలు..
Image Credit : Asianet News

స్టార్ హీరోలతో సినిమాలు..

అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనేది తన కోరిక అని అనిల్ రావిపూడి తెలిపాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో పనిచేయాలని ఉందని చెప్పాడు. బఫెట్‌లో అన్ని రకాల వంటకాలు రుచి చూసినట్లు, తన కడుపు నిండే వరకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉందని సరదాగా చెప్పుకొచ్చాడు.

55
డ్రీమ్ ప్రాజెక్టులు..
Image Credit : our own

డ్రీమ్ ప్రాజెక్టులు..

డ్రీమ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ సినిమాను, అలాగే రామాయణం లేదా మహాభారతం లాంటి ఒక పౌరాణిక చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని తనకు కోరిక ఉందని, సరైన స్థాయి వచ్చినప్పుడు వాటిని తప్పకుండా చేస్తానని అనిల్ రావిపూడి అన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
ప్రసిద్ధ వ్యక్తులు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు
Recommended image2
సినిమా ఆఫర్లు లేకపోతే.. దోసెలు వేసుకుని బ్రతికేస్తా.. నటి హేమ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved