స్టార్ హీరోయిన్ రకుల్ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె ముంబై రోడ్లపై సైకిల్ రైడ్ చేస్తూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. సైక్లింగ్ అవుట్ ఫిట్, హెల్మెంట్ ధరించిన రకుల్ ప్రీత్ పర్ఫెక్ట్ బైకర్ గా రెడీ కావడం జరిగింది. ఖరీదైన కార్లను కాదని 12 కిలోమీటర్లు సైకిల్ పై షూటింగ్ సెట్స్ కి వెళ్ళింది రకుల్. రకుల్ సైకిల్ రైడ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా అందరూ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. 

సైకిల్ పై సెట్స్ కి వెళుతున్న రకుల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఇక్కడ నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను.  12కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడే మూవీ సెట్స్ కి సైకిల్ పై వెళుతున్నానని ఆమె కామెంట్ చేయడం జరిగింది. ముంబై ట్రాఫిక్ రోడ్స్ పై కార్ కంటే కూడా సైకిల్ పైనే త్వరగా వెళ్లవచ్చని రకుల్ భావించి ఉండవచ్చు. ఏకంగా 12కిలోమీటర్లు సైక్లింగ్ చేసి రకుల్ తన ఫిట్నెస్ స్టామినా ఏమిటో నిరూపించారు. 

గతంలో సల్మాన్ లాంటి హీరోలు కూడా ముంబై రోడ్లపై సైక్లింగ్ చేసి ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అజయ్ దేవ్ గణ్, అమితాబ్ ప్రధాన పాత్రలలో మే డే మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ నటిస్తుండగా 2020 డిసెంబర్ నుండి షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని అజయ్ దేవ్ గణ్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)