సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు సెలబ్రెటీల హడావుడికి ఎక్కువైంది. ముఖ్యంగా సినీ తారలు సోషల్ మీడియాను తేటగా వాడేస్తున్నారని చెప్పవచ్చు. సినిమాకి బజ్ పెరగాలన్నా అభిమానులకు దగ్గరగా ఉండాలన్నా ఈ వేదిక ఇప్పుడు స్పెషల్ గా మారింది. ఇకపోతే సెలబ్రెటీల ఎకౌంట్స్ అప్పుడపుడు హ్యాక్ అవుతుండడం షాక్ గురిచేస్తోంది. 

కొన్ని రోజుల క్రితం హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో నటి కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ ను ఎవరో ఆగంతకులు సీక్రెట్ గా హ్యాక్ చేసినట్లు సమాధానమివ్వడం వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు సౌత్ హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్. అమ్మడు సోషల్ మీడియా వరల్డ్ లో ఎప్పటికప్పుడు బిజీగా పోటోలను సినిమాలకు సంబదించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. 

ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ అయినట్లు ట్వీట్ చేసింది. అంతే కాకుండా తన ఆధీనంలోకి వచ్చే వరకు ఎకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దని ముందుగానే ఆమె ఫాలోవర్స్ కు సూచనలిచ్చింది. రకుల్ చెప్పిన ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కార్తీ హీరోగా తెరక్కుతున్న దేవ్ సినిమాతో బిజీగా ఉంది.