Rakul Wedding Card: గోవా అందాలతో రకుల్ పెళ్లి కార్డు.. ఎంత బావుందో చూశారా

ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. తాజాగా రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rakul Preet singh wedding card goes viral dtr

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది. 

బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే జాకీ భగ్నానీ, రకుల్ దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. 

Rakul Preet singh wedding card goes viral dtr

ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. తాజాగా రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్, భగ్నానీ పెళ్లి గోవాలో జరగబోతోంది. అందుకు తగ్గట్లుగా శుభలేఖలో కూడా గోవా అందాలు కనిపించేలా ముద్రించారు. పెళ్లి కార్డుపైన కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

Rakul Preet singh wedding card goes viral dtr

పెళ్లి కార్డుపై రకుల్, భగ్నానీ పేర్లతో పాటు .. అబ్ దోనో భగ్నానీ అని కూడా రాసి ఉంది. రకుల్ పెళ్లి మూడు రోజుల పాటు భారీ ఖర్చుతో జరగబోతోందట. మూడు రోజులకు ముగ్గురు డిజైనర్స్ ని ఎంపిక చేశారు. సబ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలని రకుల్, భగ్నానీ ధరించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios