గతేడాది అక్టోబర్ నెలలో తాను జాకీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది రకుల్. ఇప్పుడు వీరిద్దరు డేటింగ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వెకేషన్లు, పార్టీలకు జంటగా వెళ్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ లవ్ కపుల్ తాజ్ మహల్‌ని సందర్శించింది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) బ్యాక్ టూ బ్యాక్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న, లవ్ లైఫ్‌ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటుడు జాకీ భగ్నానీ(Jackky Bhagnani)తో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ నెలలో తాను జాకీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది రకుల్. ఇప్పుడు వీరిద్దరు డేటింగ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వెకేషన్లు, పార్టీలకు జంటగా వెళ్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ క్రేజీ లవ్ కపుల్ తాజ్ మహల్‌ని సందర్శించింది. ప్రపంచ ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్‌మహల్‌ని ఈ జోడి సందర్శించడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు మనవ్ మంగ్లానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. Rakul, ప్రియుడు జాకీ కలిసి టూర్ వెహికల్‌లో తాజ్‌మహల్‌ని సందర్శిస్తుండగా, అభిమానులు ఫోన్‌లో బంధించిన వీడియోలను ఆయన పంచుకున్నారు. ఆదివారం ఈ జంట తాజ్ మహల్‌ని సందర్శించినట్టు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియుడితో రకుల్ తాజామహల్ టూర్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు ఎగబడి వారిని ఫోటోల్లో, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నిస్తున్నా, పట్టించుకోకుండా రకుల్ తన పని తాను చేసుకుంటూ వెళ్లడం విశేషం. ప్రస్తుతం రకుల్ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రకుల్.. అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన `దేదే ప్యార్ దే` చిత్ర దర్శకుడు లవ్ రంజన్ వివాహం ఢిల్లీలో జరుగుతుంది. ఈ వేడుకకు రకుల్ ప్రేమ జంట హాజరయ్యిందని, ఆ సమయంలో ఇలా తాజ్‌మహల్‌ని వీక్షించిందని తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుకకి రకుల్, జాకీతోపాటు రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, శ్రద్దా కపూర్ వంటి ప్రముఖలు హాజరు కావడం విశేషం.
కెరీర్ పరంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తెలుగులో `కొండపొలం` చిత్రంతో అలరించింది. ఈ సినిమా పరాజయం చెందింది. ప్రస్తుతం రకుల్‌కి తెలుగులో మరే సినిమా లేకపోవడం గమనార్హం. అదే సమయంలో బాలీవుడ్ అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా అజయ్ దేవగన్‌తో `రన్‌వే 34`, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `డాక్టర్ G`, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి `అటాక్` అనే సినిమాలు చేస్తోంది . అలాగే `థ్యాంక్ గాడ్`, `ఛత్రీవాలీ`, `మిషన్ సిండ్రెల్లా` సినిమాలకు కూడా అంగీకారం తెలిపింది.
