మన టాలీవుడ్ ఎలా ఉన్నా ..బాలీవుడ్ మాత్రం కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకుపోతోంది. కొత్త పాయింట్ లేనిదే మార్కెట్ లో నిలబడలేమని గుర్తించి ఆ దిశగా కథలు రాసుకుటోంది. నటీనటులు సైతం అలాంటి కొత్త కాన్సెప్టు దొరికితే పండులా అందుకుంటున్నారు. గత రోజుల్లోలాగ గ్లామర్ పోతుంది, క్రేజ్ కొట్టుకుపోతుందని ఆలోచించటం లేదు. గ్లామర్ హీరోయిన్ గా ముందుకు వెళ్తున్న రకుల్ ప్రీతి సింగ్ కూడా ఇప్పుడు ఓ ప్రయోగానికి సిద్దపడింది. 

మొన్నటి వరకు రకుల్ ప్రీత్ అంటే లక్కీ హీరోయిన్ . దాంతో  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సినిమాలను చేస్తూ మంచి జోష్ మీద ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఈమెకు ప్లాఫ్ లు రావటంతో ఆఫర్స్ తగ్గాయి.  ఒకటి రెండు సినిమాలు మినహా.. స్టార్ హీరోల సినిమాలు ఏవి కూడా ఈమె చేతిలో లేవు. దాంతో ఇప్పుడు రకుల్ ఓ సరికొత్త ప్రయోగానికి సిద్దమవుతుంది. ఓవైపు రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలు చేస్తూనే ఈ ప్రయోగానికి రెడీ అయింది.

ప్రఖ్యాత నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించే ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉంటుందట. కాగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని మాత్రం నిర్ణయించలేదు."ఇంటెన్స్​ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనిని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం రకుల్​, స్క్రూవాలా మధ్య చర్చలు జరిగాయి. ఇందులో నటించేందుకు రకుల్​ కూడా ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఓకే చెప్పనున్నారు. స్క్రిప్ట్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది" అని అన్నారు.

 ఇక మరోవైపు రకుల్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు హిందీ చిత్రం  సర్దార్ కా గ్రాండ్సన్ చేస్తోంది. ఈ సినిమాతో డిజిటల్ అరంగేట్రం అవుతోంది. త్వరలోనే 'మేడే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది రకుల్​. దీంతోపాటే 'థ్యాంక్​ గాడ్'​, 'సర్దార్​ కా గ్రాండ్​సన్'​, 'డాక్టర్​ జీ' సినిమాల్లోనూ నటిస్తోంది.