సొంతంగా హైదరాబాద్‌లు ఫిట్‌నెస్‌ సెంటర్లని నిర్వహిస్తుంది. ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. ఔత్సాహికులకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటోంది రకుల్‌. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విషయంతెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్‌ ఉంది. అయితే ఇటీవల హిందీపై ఎక్కువ ఫోకస్ చేసిన రకుల్‌.. ఇప్పటికే యోగా, ఫిట్‌నెస్‌ సెంటర్లని నడిపిస్తుంది. సొంతంగా హైదరాబాద్‌లు ఫిట్‌నెస్‌ సెంటర్లని నిర్వహిస్తుంది. ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. ఔత్సాహికులకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటోంది రకుల్‌. అందుకోసం ఆమె స్పెషల్‌ గా ఓ యాప్‌ని స్టార్ట్ చేసింది. 

`స్టారింగ్‌ యూ` పేరుతో ఆమె వెబ్‌సైట్‌/యాప్‌ని ప్రారంభించింది రకుల్‌. ఈ స్టార్టప్‌ కంపెనీతో 24 క్రాఫ్ట్స్ లో సినిమా అవకాశాలు కల్పించబోతుంది. ఎడ్యూకేట్‌ పూర్తయిన వారికి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అందిస్తూ, జాబ్స్ ఇప్పించేందుకు కొన్ని సంస్థలు ఎలా అయితే పనిచేస్తాయో, ఇప్పుడు రకుల్‌ ప్రారంభించిన `స్టారింగ్‌ యూ` అనేది కూడా అలానే పనిచేయబోతుంది. స్కిల్స్ ఉన్నవారిని గుర్తించి వారికి అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. 

View post on Instagram

రకుల్‌ తన సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి ఈ స్టార్టప్‌ని ప్రారంభించింది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వారికి ఇదో డిజిటల్‌ వేదికగా పని చేయనుంది. మూవీ సెక్టార్‌కి సంబంధించి 24 క్రాఫ్ట్‌లలో అనుభవం ఉన్న వారు ఈ యాప్‌ ద్వారా తమ డ్రీమ్స్‌ నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో `స్టారింగ్‌యూ` ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వారి ప్రతిభని గుర్తించి ఎవరు దేనికి సెట్‌ అవుతారో అనే విషయాన్ని కూడా క్లారిటీగా ఇందులో వెల్లడించనున్నారట. దీంతో సినిమాలు చేయబోయే మేకర్స్ కి దీని వల్ల ఈజీ కానుందని చెప్పొచ్చు. 

ఇక కెరీర్‌ పరంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. `ఎటాక్‌`, `రన్‌వే 34`, `థ్యాంక్‌ గాడ్‌`, `డాక్టర్‌ జీ`, `మిషన్‌ సిండెరెల్లా`, `చత్రివాలి` చిత్రాలు చేస్తుంది. తమిళంలో `అయలాన్‌`, `31అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌`, `ఇండియన్‌ 2` సినిమాలు చేస్తుంది రకుల్‌. ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతుంది. వీరిద్దరు ఓపెన్‌గానే డేటింగ్‌లో ఉన్నారు. త్వరలో మ్యారేజ్‌ కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.