టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ, హిందీ భాషలలో బిజీగా గడుపుతోంది. తెలుగులో అవకాశాలు లేనప్పటికీ మిగిలిన భాషల్లో అమ్మడుకి బాగానే ఛాన్స్ లు వస్తున్నాయి. వెంకీ నటిస్తోన్న 'వెంకీ మామ'లో రకుల్ కనిపించనుందని టాక్.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఆమె ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. తన స్నేహితులతో కలిసి సరదాగా లండన్ వెళ్లిందట రకుల్. అక్కడ ఓ స్టార్ హోటల్ లో ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేసిందట.

అనుకున్నట్లుగానే వారిని హోటల్ కి తీసుకెళ్లి విందు పార్టీ ఇచ్చింది. రకుల్ తో పాటు మొత్తం పది మంది మాత్రమే హోటల్ కి వెళ్లారట. కానీ అక్కడ బిల్ ఎంత అయిందో తెలుసా.. రూ.10 లక్షలు. ఒకపూట పార్టీకి ఆ రేంజ్ లో బిల్ వేసేసరికి రకుల్ షాక్ అయిందట.

కానీ ఇంక మరో ఆప్షన్ లేక ఆ మొత్తాన్ని చెల్లించి బయటపడినట్లు వెల్లడించింది. జీవితంలో ఆ హోటల్ కి మాత్రం వెళ్లకూడదని ఫిక్స్ అయిందట. త్వరలోనే ఆమె నటించిన 'ఎన్‌జీకే' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.