నా కెరీర్ లో అన్ని సార్లు నేను కథ నచ్చిన తరువాతనే సినిమాలు ఒప్పుకోలేదు కొన్నిసార్లు కథ నచ్చదు. అయితే ఆ సినిమాలో ఆ సినిమాలో స్టార్ హీరో ఉండొచ్చు, లేదా పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద బ్యానర్ లో ఆ సినిమా తీస్తూ ఉండొచ్చు.
ఏ పరిశ్రమలోనైనా అన్నీ అనుకున్నట్లు జరగవు. కొన్ని మొహమాటం కోసం, మరికొన్ని డబ్బు కోసం, వేరేవి తన వాళ్ల కోసం చేయకతప్పదు. అదే విషయాన్ని రకుల్ ప్రీతి సింగ్ స్పష్టంగా చెప్తోంది. దాదాపు పదేళ్ల పాటు హీరోయిన్ గా ఉంటూ ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు తిని ఎదిగిన రకుల్ .., ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ఉండాలో చెప్తోంది. ఎలా ఉండకూడదో వివరిస్తోంది.
రకుల్ మాట్లాడుతూ... ‘సినీ పరిశ్రమలో ఒక్కోసారి మొహమాటాల నుండి తప్పించుకోలేము, పైగా ఎవరికైనా అవి తప్పవు కూడా. సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే మనసుకు నచ్చనివి కూడా ఎంతో ఇష్టపడుతూ చెయ్యాల్సి ఉంటుంది. ‘నా కెరీర్ లో అన్ని సార్లు నేను కథ నచ్చిన తరువాతనే సినిమాలు ఒప్పుకోలేదు కొన్నిసార్లు కథ నచ్చదు.
అయితే ఆ సినిమాలో స్టార్ హీరో ఉండొచ్చు, లేదా పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద బ్యానర్ లో ఆ సినిమా తీస్తూ ఉండొచ్చు. ఒక హీరోయిన్ ఇలాంటివి కూడా ఆలోచించుకొని సినిమాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముందే తెలిసిపోతుంది, ఆ సినిమా ఆడదు అని, అలా తెలిసినప్పటికీ ఆ సినిమా చేయాల్సి వస్తోంది.
ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదగాలంటే, మొహమాటం కోసం కొన్ని చెయ్యక తప్పదు. పైగా ఆ సినిమా చేస్తే ఎక్కువ డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే.. రెమ్యునరేషన్స్ విషయంలో హీరోయిన్స్ కి ఎక్కువ లాభం కలిగేది కూడా అలాంటి సినిమాల నుండే’ అంటూ తన జ్ఞానాన్ని, తన అనుభవాన్ని కొత్త బ్యూటీలకు వివరంగా చెప్పుకొచ్చింది రకుల్.
