గత కొంతకాలంగా రకుల్ ప్రీతి సింగ్ పరిస్దితి ఏమీ బాగోవటం లేదు. ఏ సినిమా పట్టుకున్నా అది డిజాస్టర్ అయ్యిపోతోంది. ముఖ్యంగా స్పైడర్ సినిమా పరాజయం తర్వాత మరీ దారుణమైపోయింది. అయితే ఇలాంటి పరిస్దితుల్లోనూ హిందీలో అజయ్ దేవగన్ తో చేసిన దే దే ప్యార్ దే చిత్రం ఓకే అనిపించుకుని గట్టెక్కి ఊపిరి పీల్చుకునే లా చేసింది.  

అయితే ఈ రోజు రిలీజైన ఎన్జీకే చిత్రం సైతం మళ్లీ డిజాస్టర్ అవటం ఆమెకు పెద్ద నిరాశే . దాంతో ఆమెకు ఐరన్ లెగ్ అనేస్తారనే భయం పట్టుకుందిట. గతంలో ఇలాంటి ముద్ర చాలా మంది హీరోయిన్స్ పై పడింది. ఇప్పుడు అదే ముద్ర తనపై పడకుండా ఉండాలని ప్రయత్నిస్తోంది కానీ వర్కవుట్ కావటం లేదు. 

దీనికి తోడు రకుల్ కు తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత సంవత్సర కాలంగా రకుల్ తమిళ చిత్ర పరిశ్రమ లోనే ఎక్కువ కాలం గడపింది. అయితే వెంకటేష్ – నాగ చైతన్య నటిస్తున్న వెంకీ మామ చిత్రం ఆఫర్ రావటంతో మళ్లీ టాలీవుడ్ లోకి తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు ఊహించని విదంగా ఆమె మార్చేసింది ఆ చిత్ర టీమ్. ఆమె స్థానంలో నభ నటేష్ ను తీసుకున్నట్టు  తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే మనం, ఇష్క్‌, 24 సినిమాల దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని తదుపరి చిత్రానికి ఒక స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ను సంప్రదించారట. ఇది ఓకే చేయాలా వద్దా అనే డైలమోలో ఉందిట.  సినిమాలు పెద్దగా లేని  ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ఇలాంటి సాంగ్స్  చేస్తే ఐటెం గర్ల్ ముద్ర వేసి అవే కంటిన్యూగా ఇస్తారేమో  అనేది ఆమె భయం. దీనితో ఆమె ఎటూ తేల్చుకోలేని పరిస్థితి లో ఉందని చెప్తున్నారు.