స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. రకుల్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. అదే సమయంలో ఈ క్రేజీ హీరోయిన్ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ మధ్యన రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న డ్రెస్ పై ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్ చేయడం, అతడికి రకుల్ ధీటుగా సమాధానం చెప్పడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

పొట్టి దుస్తులతో ఉన్న ఫోటోలని రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కారులో సెషన్స్ చేసి వస్తున్నావా అంటూ నెటిజన్ అసభ్యంగా కామెంట్ చేశాడు. మీ తల్లికి ఉందేమో కారులో సెషన్స్ చేసే అలవాటు అంటూ రకుల్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ విషయంలో రకుల్ కి కొందరు సపోర్ట్ చేశారు. మరి కొందరు మాత్రం అతడు చేసిన తప్పుకు వాళ్ళ తల్లిని ఎందుకు లాగడం అని రకుల్ ని విమర్శించారు. 

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ డ్రెస్ గురించి మరోమారు చర్చ జరిగింది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. రకుల్ డ్రెస్ ని విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రకుల్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు నా వద్ద సమాధానం లేదు. నా వ్యక్తిగత విషయాల గురించి విమర్శిస్తే తాను స్పందిస్తానని రకుల్ తెలిపింది. 

నాపై వచ్చే విమర్శలు నా కుటుంబ సభ్యులపై ప్రభావం చూపే విధంగా ఉంటే తప్పకుండా బదులిస్తా అని రకుల్ తెలిపింది. హద్దులు దాటే అందాల ప్రదర్శన వల్ల లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయనే వాదనకు మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న రకుల్ కు ఎదురైంది. దీనిపై నేను స్పందించను. జనాల మనసుల్లో చెడు ఆలోచనలు ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని తెలిపింది. రకుల్ ఇటీవల దే దే ప్యార్ దే చిత్రంతో బాలీవుడ్ లో విజయాన్ని అందుకుంది. అదే విధంగా తమిళ చిత్రం ఎన్.జి.కె పరాజయం చెందింది.