కన్నడ సినిమా గిల్లితో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ రకుల్ ప్రీత్‌ సింగ్‌. తెలుగులో చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు మహేష్ బాబు, రామ్‌ చరణ్‌ లాంటి హీరోలతో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. తెలుగులో సీనియర్‌ హీరో నాగార్జునతో మన్మథుడు 2 సినిమాలో నటించిన తరువాత మరో సినిమాలో కనిపించలేదు.

అయితే ఇటీవల బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌ అయ్యింది. క్లీవేజ్‌ షోతో పాటు హాట్‌ ఫోటోలను షేర్ చేస్తూ ఓ రేంజ్‌ లో రచ్చ చేస్తోంది. దీంతో అమ్మడి సోషల్ మీడియా పేజ్‌ను నెటిజెన్లు భారీగా ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ అరుదైన రికార్డ్‌ను అందుకుంది. రకల్‌ ఇన్‌స్టా పేజ్‌కు 15 మిలియన్ల(కోటీ 50 లక్షల)కు పైగా ఫాలోవర్స్ అయ్యారు.

దీంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్  చేసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.ఈ వీడియోలో తాను చిన్న వయసు నుంచే నటించటం ప్రారంభించానని నా పని, సోషల్ మీడియా ద్వారానే చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. తనకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా కృత్జజ్ఞతలు తెలిపింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.