అతి తక్కువ టైమ్ లోనే వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరితో జతకట్టింది. కొన్నాళ్లుగా వరసగా ఫ్లాఫ్ లు పలకరించడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌కి మకాం మార్చింది. 


సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన “వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్” సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్‌. అతి తక్కువ టైమ్ లోనే వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరితో జతకట్టింది. కొన్నాళ్లుగా వరసగా ఫ్లాఫ్ లు పలకరించడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ వరస ప్రాజెక్టులు చేస్తోంది. తాజాగా ఆమె ఓ పెద్ద ప్రాజెక్టుని తన కిట్టీలో వేసుకుంది.

హిందీ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హిందీలో ఐదు సినిమాలు (‘డాక్టర్‌ జీ’, ‘మే డే’, ‘థ్యాంక్‌.. గాడ్‌’, ‘ఎటాక్‌’, మరాఠీ ఫిల్మ్‌ ‘బక్కెట్‌ లిస్ట్‌’ ఫేమ్‌ తేజస్‌ దర్శకత్వంలో సినిమా) చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ సినిమాకు పచ్చజెండా ఊపారని టాక్‌. అక్షయ్‌ కుమార్‌ సరసన ఓ సినిమా అంగీకరించారట. అక్షయ్‌ హీరోగా రంజిత్‌ తివారీ దర్శకత్వంలో ‘బెల్‌బాటమ్‌’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

మళ్లీ రంజిత్‌ దర్శకత్వంలో అక్షయ్‌ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌కు ఛాన్స్‌ ఇచ్చారట. ఆ ప్రాజెక్టు మరేదో కాదు హిందీ ‘రాక్షసుడు’ రీమేక్ అని తెలుస్తోంది. అక్షయ్, రకుల్‌ కాంబినేషన్‌లో రంజిత్‌ తెరకెక్కించనున్నది తమిళ ‘రాచ్చసన్‌’ (2018) హిందీ రీమేక్‌. ఈ సినిమా ఈ వారంలోనే లండన్ లో ప్రారంభం కానుంది. ఒక నెల రోజుల్లో ఈ చిత్రం షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో అనుపమా పరమేశ్వరన్ చేసిన పాత్రను రకుల్ చేయనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. టైట్ స్క్రీన్ ప్లే సాగే ఈ సినిమా తమిళ,తెలుగులో పెద్ద హిట్టైంది. 

ఇక రకుల్...లేడీ డైరెక్టర్‌ అనుభూతీ కశ్యప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్‌ వైద్య విద్యార్థిని ఫాతిమా పాత్రలోనూ, డా. ఉదయ్‌ గుప్తా పాత్రలో ఆయుష్మాన్‌ కనిపిస్తారు. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, ఇంకా కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’ కూడా చేస్తున్నారు.ఆమె నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘డాక్టర్‌ జి’ షూటింగ్‌ భోపాల్‌లో జరుగుతోంది. అక్కడి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ చేస్తున్నారు.