టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. ఆమె సక్సెస్ రేట్ తగ్గడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెపై దృష్టి పెట్టడం లేదు. అలాంటి సమయంలో సీనియర్ హీరో నాగార్జున సరసన 'మన్మథుడు 2' సినిమాలో నటించడానికి ఒప్పుకొని షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో రకుల్ సిగరెట్ కాలుస్తూ కనిపించింది.

టీజర్ లో ఈ సన్నివేశాలు చూసిన అభిమానులు షాకయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రకుల్ మీడియా వాళ్లకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ 'సినిమాలో కాస్త బోల్డ్ గా నటించినట్లున్నారు..' అని ప్రశ్నించగా.. వెంటనే రకుల్ ఫైర్ అయింది. మీరు.. దేని గురించి అడుగుతున్నారో నాకు తెలుసంటూ మండిపడింది.

''ఈ సినిమాలో సిగ‌రెట్ తాగిన సీన్ ఉంది. దాని కోస‌మే క‌దా? సిగ‌రెట్లు తాగితే బోల్డ్‌నెస్ అయిపోతుందా? అవంతిక అనే అమ్మాయి సిగ‌రెట్లు తాగ‌డం గురించిన క‌థ కాదిది. సిగ‌రెట్లు తాగే అల‌వాటున్న అవంతిక క‌థ ఇది. అయినా హీరోలు సిగ‌రెట్ తాగితే త‌ప్పు లేదు కానీ, హీరోయిన్లు కాలిస్తే త‌ప్పొచ్చిందా? బ‌య‌ట స‌మాజంలో, రోడ్డు మీద ఇంకా చాలా చాలా విష‌యాలే జ‌రుగుతున్నాయి. వాటి గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. సినిమాలో కాస్త బోల్డ్‌నెస్ చూపించ‌గానే సంస్క్రృతి, సంప్ర‌దాయాలు గుర్తొస్తాయి. సినిమాల ద్వారా చెడు అల‌వాట్ల‌ని ప్రోత్స‌హించ‌డం లేదు. అలాంటి స‌న్నివేశాలు వ‌స్తున్న‌ప్పుడు మ‌ద్య‌పానం, ధూమ‌పానం హానిక‌రం అని స్లైడింగ్ కూడా వేస్తున్నాం క‌దా?'' అంటూ చెప్పుకొచ్చింది.