నవంబర్‌ సినీ సెలబ్రిటీలకు వెకేషన్‌ మంన్త్ గా మారిపోయింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు అన్ని కుదుట పడుతున్నాయి. రెగ్యులర్‌ లైఫ్‌కి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలలు ఇంట్లో బంధీగా ఉన్న సెలబ్రిటీలు జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. వెంటనే సేద తీరేందుకు రెడీ అయిపోతున్నారు. గ్యాప్‌ లేకుండా విదేశాలకు చెక్కేస్తున్నారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, కాజల్‌, తాప్సీ వంటి వారు ఇప్పటికే తమ వెకేషన్స్ ని పూర్తి చేసుకున్నారు. 

ఇక ఇప్పుడు రకుల్‌ వంతు వచ్చింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాల్డీవులకు చెక్కేసింది. మొన్నటి దాక కాజల్‌ అక్కడే తన హనీమూన్‌ని ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు రకుల్‌ మాల్దీవ్స్ లో ఎంజాయ్‌ చేస్తుంది. అయితే అందరు ప్రియుడితో ఇలాంటి వెకేషన్‌ కి వెళ్తారు. కానీ రకుల్‌ మాత్రం తన సోదరుడితో వెళ్ళింది. అమన్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లి సేద తీరుతుంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది రకుల్‌. 

అందమైన బీచ్ లలో గ్రీన్ కలర్ బికినీ ధరించి ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సముద్ర వాసన,  ఆకాశపు అనుభూతితో మనసు తేలియాడుతుందని చెబుతూ, బికినీలో ఓ ఫోటోని పంచుకుంది రకుల్‌. మాల్దీవుల్లోని లక్స్ సౌతారీ లో రకుల్‌ ఈ ఫోటో దిగింది. మరో ఫోటోలో సాయంకాలం వేళ బికినీలో తన సోదరుడు అమన్‌తో కలిసి సెల్ఫీ దిగింది రకుల్‌. ఇందులో అమన్‌ వైన్‌ తీసుకుంటూ కనిపించాడు. సోదరుడితో కలిసి రకుల్‌ కూడా ఆల్కహాల్‌ తీసుకుందని వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

దీనిపై అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు, అందరు ప్రియుడితో వెళ్తారు, నువ్వేంటి బ్రదర్‌తో వెళ్ళావని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు దిశా పటానీ సైతం మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సెలబ్రిటీలంతా మాల్దీవుల్లో మకాం పెట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం రకుల్‌ `చెక్‌`, `భారతీయుడు 2`తోపాటు `మేడే`, అర్జున్‌ కపూర్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.