MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rithu Chowdary: డీమాన్‌ పవన్‌నే పెళ్లి చేసుకుంటా.. రీతూ చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

Rithu Chowdary: డీమాన్‌ పవన్‌నే పెళ్లి చేసుకుంటా.. రీతూ చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌ బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోలో సందడి చేశారు. రియల్‌ లవర్స్ గా రాణించారు. ఈ క్రమంలో తాజాగా రీతూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. డీమాన్‌ పవన్‌ని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 19 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోలో లవర్స్ గా రాణించిన రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌
Image Credit : youtube/@StarMaaOfficial

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోలో లవర్స్ గా రాణించిన రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌

రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌ ఇటీవల బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు రొమాన్స్, కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు. నిజంగానే లవర్స్ అనేలా రచ్చ చేశారు. డీమాన్‌ పవన్‌ విషయంతో రీతూ, రీతూ విషయంలో పవన్‌ ప్రేమగా ఉన్నారు. మంచి జోడీ అనిపించుకున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీనే షోలో బాగా పండిందని చెప్పొచ్చు. దీని వల్లే ఈ ఇద్దరు చివరి వరకు సర్వైవ్‌ కాగలిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తమ బాండింగ్‌ని తెలిపిన రీతూ, డీమాన్‌ పవన్‌
Image Credit : Starmaa

తమ బాండింగ్‌ని తెలిపిన రీతూ, డీమాన్‌ పవన్‌

రీతూ, పవన్‌ రిలేషన్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో చాలా రకాలుగా చర్చ జరిగింది. అంతెందుకు బిగ్‌ బాస్‌ షోకి వెళ్లిన దివ్వెల మాధురీ కూడా హాట్‌ కామెంట్‌ చేసింది. వారిది ఫేక్‌ రిలేషన్‌ అని, కంటెంట్‌ కోసం కలరింగ్‌ ఇస్తున్నారని, ఎలిమినేషన్‌ కాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారంటూ కామెంట్ చేసింది. ఆమెతోపాటు వచ్చిన రమ్య మోక్ష కూడా అలానే మాట్లాడింది. ఎంత బ్యాడ్‌ చేసిన వీరిద్దరు చివరి వరకు నిలబడ్డారు. షోలోనే కాదు, షో నుంచి బయటకు వచ్చాక కూడా అదే కెమిస్ట్రీని పండిస్తున్నారు, అదే రేంజ్‌లో తమ బాండింగ్‌ని తెలియజేస్తున్నారు.

36
పెళ్లిపై రీతూ చౌదరీ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Image Credit : youtube/@StarMaaOfficial

పెళ్లిపై రీతూ చౌదరీ బోల్డ్ స్టేట్‌మెంట్‌

రీతూ చౌదరీకి సంబంధించిన చాలా రకాల వివాదాలు, వార్తలు వినిపించాయి. ఆమెకి ఆల్‌రెడీ పెళ్లి అయ్యిందని, విడిపోయారనే వార్తలు వచ్చాయి. తను కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. శ్రీకాంత్‌ అనే వ్యక్తితో రిలేషన్‌ గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసుకుంది. బిగ్‌ బాస్‌ షో నుంచి వచ్చాక పూర్తిగా కొత్త రీతూ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎక్కువగా డీమాన్‌ పవన్‌తోనే కలిసి కనిపిస్తుంది. ముఖ్యంగా టీవీ షోస్‌ విషయంలో వీరిద్దరు కలిసే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది రీతూ.  పవన్‌ని పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.

46
డీమాన్‌ పవన్‌ని పెళ్లి చేసుకుంటా- రీతూ చౌదరీ
Image Credit : youtube/@StarMaaOfficial

డీమాన్‌ పవన్‌ని పెళ్లి చేసుకుంటా- రీతూ చౌదరీ

బిగ్‌ బాస్‌ తెలుగు 9లో పాల్గొన్న వారందరితో కలిసి బీబీ ఉత్సవం పేరుతో ఓ షో నిర్వహించారు. 9వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు అంతా ఇందులో సందడి చేశారు. నాన్‌ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించారు. దీనికి శ్రీముఖి యాంకర్‌గా చేసింది. ఈ షోలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని రీతూ చౌదరీని శ్రీముఖి ప్రశ్నించింది. దీనికి రీతూ చౌదరీ స్పందించింది. మరో మాట లేకుండా తన మనసులో మాట చెప్పేసింది. పవన్‌ కుమార్‌ ఉప్పలని మ్యారేజ్‌ చేసుకుంటానని చెప్పేసింది. డీమాన్‌ పవన్‌ అసలు పేరు పవన్‌ కుమార్‌ ఉప్పల. షోలో అందరి ముందు రీతూ చౌదరీ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం షాకిచ్చింది. దీనికి పవన్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఇతర కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

56
రీతూని ఎత్తుకొని డీమాన్‌ పవన్‌ ఆనందం
Image Credit : youtube/@StarMaaOfficial

రీతూని ఎత్తుకొని డీమాన్‌ పవన్‌ ఆనందం

బీబీ ఉత్సవం షోలో ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌లో భాగంగా రీతూ చౌదరీ ఈ విషయాన్ని చెప్పింది. అనంతరం అక్కడ అంతా అరుపులతో హోరెత్తించారు. అంతేకాదు పవన్.. రీతూకి స్టేజ్‌పై ప్రపోజ్‌ చేశాడు. రోజా పువ్వు ఇచ్చి ఆమెని ఎత్తుకుని తన ప్రేమని వ్యక్తం చేశాడు. లవ్‌ సింబల్స్ తో ప్రోమో స్పెషల్‌గా మారింది. అంతేకాదు ఈ జంటకి ఆడియెన్స్ వంద శాతం రేటింగ్‌ విశేషం. ఈ విషయాన్ని రీతూ గేమ్‌లో భాగంగానే చెప్పిందా? నిజంగానే చెప్పిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ షో ఈ నెల 22న స్టార్‌ మాలో రాత్రి ఆరుగంటల నుంచి ప్రసారమవుతుంది.

66
బీబీ ఉత్సవంలో నాగార్జునతోపాటు వచ్చింది వీరే
Image Credit : youtube/@StarMaaOfficial

బీబీ ఉత్సవంలో నాగార్జునతోపాటు వచ్చింది వీరే

ఇందులో కింగ్‌ నాగార్జున కూడా పాల్గొన్నారు. ఆయన తనదైన స్టయిల్‌లో ఫన్‌ చేసి ఆకట్టుకున్నారు. మరోవైపు ఇమ్మాన్యుయెల్‌ కామెడీ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఈ షోలో బిగ్ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కళ్యాణ్‌ పడాల, తనూజ, ఇమ్మన్యుయెల్‌, సంజనా, డీమాన్‌ పవన్‌, రీతూ, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, గౌతమ్‌, నిఖిల్‌, ప్రియా, శ్రీజ, సాయి శ్రీనివాస్‌, రాము రాథోడ్‌, దివ్య, భరణి, ఫ్లోరా, సుమన్‌ శెట్టి, శ్రష్టి వర్మ, మర్యాద మనీష్‌ వంటి వారు పాల్గొన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Chiranjeevi: రజనీకాంత్‌, మోహన్‌ బాబు కుట్ర.. చిరంజీవికి ఇండస్ట్రీ హిట్‌ మిస్‌, కానీ మంచే జరిగిందా?
Recommended image2
Vijay Deverakonda Request విజయ్‌ దేవరకొండ, రష్మికలకు కొత్త తలనొప్పి.. పర్సనల్‌ విషయాలు లీక్‌పై అసహనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved