గ్లామర్‌ బొమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో సినిమాలు లేవంటూనే బ్యాక్‌ టూ బ్యాక్‌ కొట్టేస్తుంది. అయితే గ్లామర్‌కే ప్రయారిటీ ఇవ్వడంతో తెలుగులో అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. అందుకు తగ్గన్నట్టుగానే బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిందీ బ్యూటీ. తాజాగా తెలుగులో ఈ అమ్మడు క్రిష్‌ దర్శకత్వంలో, వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో రకుల్‌ రైతు బిడ్డగా, గొర్ల కాపరిగా కనిపిస్తారని సమాచారం. ఆమె పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనుందట. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది రకుల్‌. ఒక సాంగ్‌ మినహా దాదాపు షూటింగ్‌ అంతా పూర్తయ్యిందట. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. `డ్రీమ్‌ టీమ్‌తో.. డ్రీమ్‌ రోల్‌ చేయడం చాలా ఆనందంగా ఉంద`ని పేర్కొంది. ఇదొక వండర్‌ఫుల్‌ ఎక్స్ పీరియెన్స్ అని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని షేర్‌ చేసింది రకుల్‌. దీనికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఫస్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతుంది. దీంతోపాటు రకుల్‌ తెలుగులో `చెక్‌` చిత్రంలో నితిన్‌ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో `భారతీయుడు2`, అలాగే హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తుంది.