రకుల్ ప్రీత్ సింగ్ హవా ప్రస్తుతం సౌత్ లో బాగా తగ్గిపోయింది. నార్త్ లో మాత్రమే ఆమెకి ఒకటి అరా అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలు చేస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ హవా ప్రస్తుతం సౌత్ లో బాగా తగ్గిపోయింది. నార్త్ లో మాత్రమే ఆమెకి ఒకటి అరా అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలు చేస్తోంది. కానీ సౌత్ లో మాత్రం ఆమెకి ఆఫర్స్ రావడం లేదు. రకుల్ చివరగా తెలుగులో కొండపొలం అనే చిత్రంలో నటించింది. 

ఇటీవల రకుల్ కీలక పాత్రలో నటించిన భారతీయుడు 2 విడుదలైంది. ఈ చిత్రం శంకర్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత రకుల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కొందరు నెటిజన్లు రకుల్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 

కొత్త వాదనని తెరపైకి తీసుకువస్తున్నారు. భారతీయుడు 2 చిత్రంలో ఆమె నటించింది అంతే.. రిజల్ట్ తో రకుల్ కి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆమెని టార్గెట్ చేస్తున్నారు. సీక్వెల్స్ చిత్రాల్లో రకుల్ నటిస్తే ఆ మూవీ ఫ్లాపే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 

రకుల్ నటించిన ప్రతి సీక్వెల్ చిత్రం డిజాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. రకుల్ నటించిన కిక్ 2, మన్మథుడు 2, భారతీయుడు 2 ఇలా ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లు నెటిజన్లు చెబుతున్నారు.