నార్త్ నుంచి వచ్చి ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫిక్సయిపోయిన రకుల్ ప్రీత్ జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటోంది. బేబీకి  స్పైడర్ సినిమా తరువాత కొంత అవకాశాలు తగ్గినా కూడా రెమ్యునరేషన్ లో పాత్ర టైమ్ బాగా కలిసొస్తోంది. 

దేవ్ సినిమాతో కోలీవుడ్ లో కూడా డిజాస్టర్ అందుకున్న రకుల్ కి ఇప్పుడు డిమాండ్ తగ్గుతుంది అని వస్తోన్న కామెంట్స్ కు మన్మథుడు 2 అఫర్ ఒక కౌంటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాకు రకుల్ 2 కోట్లను రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు తెలుస్తోంది. 

నాగార్జున తో నటించడానికి వయసు సాకుతో ఈ రేట్ అందుకున్నప్పటికీ బేబీకి సినిమా ఎంతవరకు కలిసొస్తుంది అనేది పెద్ద సందేహమే. మొదట పాయల్ రాజ్ పుత్ తో చర్చలు జరుపగా మళ్ళీ రకుల్ వైపే షిఫ్ట్ అయ్యారు. రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాతో ఆల్రెడీ చైతుతో రొమాన్స్ చేసిన రకుల్ ఇప్పుడు నాగ్ తో నటించడం అనేది పెద్ద సవాలే.. గతంలో మెగా హీరోలను సున్నితంగా కవర్ చేసిన కాజల్ లాగా రకుల్ కూడా అక్కినేని హీరోలను కవర్ చేస్తుందేమో చూడాలి.