Asianet News TeluguAsianet News Telugu

కరణం మల్లీశ్వరిగా చేయాలంటే ఇదీ కండీషన్

ప్రేరణగా అనిపించే బయోపిక్ లుకు డిజిటల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. అలాగే ప్రభుత్వం తరుపు నుంచి అవార్డ్ లు, వినోదపు పన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహాలు ఉంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా టాలీవుడ్లో మ‌రో క్రీడాకారిణి బయోపిక్ తెరకెక్కటానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత క‌థ‌ను త్వ‌ర‌లో వెండితెర‌పైకి తీసుకురాబోతున్నారు.  
 

Rakul Preet okays Malleswari biopic but with a condition?
Author
Hyderabad, First Published Aug 6, 2020, 8:15 AM IST

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఎక్కడెక్కడి ప్రముఖల జీవితాలు రీసెర్చ్ చేసి తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నారు. ప్రేరణగా అనిపించే బయోపిక్ లుకు డిజిటల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. అలాగే ప్రభుత్వం తరుపు నుంచి అవార్డ్ లు, వినోదపు పన్ను మినహాయింపు వంటి ప్రోత్సాహాలు ఉంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా టాలీవుడ్లో మ‌రో క్రీడాకారిణి బయోపిక్ తెరకెక్కటానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవిత క‌థ‌ను త్వ‌ర‌లో వెండితెర‌పైకి తీసుకురాబోతున్నారు.  

నిర్మాత కోన వెంకట్ ప్రస్తుతం ఒలింపిక్ విజేత, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కరణం మల్లీశ్వరిగా కనిపించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారట . ముందుగా తాప్సిని హీరోయిన్ గా అనుకోగా ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక కుదరల్లేదని తెలుస్తోంది . అయితే పాత్ర  ఫిట్నెస్ పై ఎక్కువ అవగాహన ఉన్న  హీరోయిన్ అయితే బాగా సెట్ అవుతుందని భావించిన కోన వెంకట్ రకుల్ ప్రీత్ ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేయాలని భావిస్తున్నాడట. రకుల్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాసం ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

అయితే రకుల్ ప్రీతి సింగ్ తాను ఆ బయోపిక్ చేయటానికి ఇబ్బంది ఏమీ లేదన్నా, రెమ్యునేషన్ దగ్గరే తెగటం లేదని సమాచారం. వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న రకుల్ తో హీరోయిన్ ఓరియెంటెండ్ లాంటి ఈ సినిమా చేస్తే ఎంత మేరకు బిజినెస్ అవుతుందో తెలియదు. కానీ తెలుగు,తమిళ, హిందీ భాషల్లో మార్కెట్ అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రకుల్ ...ఎక్కువ డిమాండ్ చేస్తోందిట. అంతేకాదు షూటింగ్ జరిగినన్ని రోజులు తాను ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా రెడీ అవ్వాల్సి ఉంటుందని కాబట్టి ఆ ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలనే కండీషన్ పెట్టిందిట. ఈ విషయమై నిర్మాత కోన వెంకట్ డిస్కషన్స్ చేస్తున్నారట.
 

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు.. గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. వరస  ఫ్లాఫ్ లు ఆమె కెరీర్ ని దెబ్బ కొట్టేసాయి. దాంతో ఆమధ్యన  హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. సీనియర్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేసింది. అయినా అక్కడా వెలుగు ప్రారంభం కాలేదు.  మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా, ఆ పేరు అవకాశాలను తెచ్చి పెట్టలేదు. ముఖ్యంగా రకుల్ తెలుగులో నాగార్జునతో  చేసిన 'మన్మథుడు 2' డిజాస్టర్ తో మరీ వెనకపడి పోయింది.  

తనతో పాటు సినీ రంగంలోకి వచ్చిన మిగతా హీరోయిన్లతో పోలిస్తే, రకుల్ అనుకున్నంతగా అవకాశాలు రాకపోవటం ఆమెను బాధిస్తోంది. ఈ విషయాన్ని గమనించి రకుల్ ఆలోచనలో పడింది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios