రకుల్ ప్రీత్ కెరీర్ ట్రాక్ ఊహించని మలుపులు తిరుగుతోంది. సక్సెస్ అందుకున్నట్టే అందుకొని ఊహించని విధంగా డిజాస్టర్స్ ను చూస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య మన్మథుడు 2 సినిమాతో కాస్త హంగామా చేసిన బేబీ సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డేనే నెగిటివ్ కామెంట్స్ ను అందుకుంది. 

ఆ సంగతి పక్కనపెడితే.. అమ్మడు తనకు మన్మథుడు సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితోనే మరోసారి కలిసి పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 కంటే ముందే నానితో ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాడు. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లానని అనుకున్నప్పటికీ కుదరలేదు. 

మొత్తానికి నాని కథను నమ్మి రాహుల్ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లానని అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమాలో రకుల్ అయితే బెస్ట్ అని నానితో ఇటీవల దర్శకుడు డిస్కస్ చేసినట్లు సమాచారం. నాని కూడా పాజిటివ్ గా స్పందించినట్లు టాక్. ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.