రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా ఉన్న కానీ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.గత కొంత కాలంగా అమ్మడు మీద పలు పుఖార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అదే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగింది.

త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేస్కోబోతున్నారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.తనపై వస్తున్నా ఈ వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది.ఆమె మీడియాతో మాట్లాడుతూ పది ఏళ్ళ తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకుంటే నటించిన ప్రతి సినిమా గుర్తుండి పోవాలి.తనపై అభిమానుల ఆదరణ ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తాను.

ఆ తర్వాత నాకు ఎత్తు 5.9అడుగుల ఎత్తు ఉన్న వాడు ..నన్ను అర్ధం చేసుకునేవాడు దొరికితే తప్పకుండా అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది .అయితే అమ్మడు చెప్పిన సమాధానానికి మీడియాలో వస్తున్నా వార్తలకు ఎమన్నా లింక్ ఉందా అని ఆలోచిస్తే అమ్మడు ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు ఉంది కదా .మరి ఆయన ఎవరో అమ్మడిచ్చిన క్లూతో ఆలోచించండి ..!