ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రారంభం నుంచీ ఫిట్‌నెస్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందనే సంగతి తెలిసిందే. షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ వర్కవుట్లకు సమయం కేటాయిస్తుంది. దానికి తోడు ఇటీవలి కాలంలో యోగా కూడా ప్రారంభించింది. కష్టతరమైన ఆసనాలు వేస్తోంది. వాటిని క్రమం తప్పకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. అయితే అదంతా ఓ ఎత్తు.. ఎఫ్ 45 పేరిట జిమ్ ప్రాంచైజీ నిర్వహణ ఒకెత్తు.

 రకుల్ ఎంటర్ ప్రెన్యూర్ స్కిల్ గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన పనేలేదు. షూటింగ్ లేక ఉంటే జిమ్ లోనే గడుపుతా అని చెప్పిన రకుల్ బిజినెస్...కరోనా సమయంలో బాగా దెబ్బతింది. దాదాపు సంవత్సరం పాటు హైదరాబాద్, వైజాగ్ లలో ఏర్పాటు చేసిన జిమ్ లు క్లోజ్ చేసి ఉంచి,ఈ మద్యనే తెరిచారు. అయితే ఆ సమయంలో ఆ జిమ్ లలో ఉద్యోగస్దులు పరిస్దితి ఏమిటి.. అన్న దానికి ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూ లో సమాధానం ఇచ్చారు.

నా బిజినెస్ ను కరోనా మహమ్మారి నన్ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతూ.. లాక్ డౌన్ లో సంస్థలో పని చేసిన ఎంప్లాయిస్ ను ఏ మాత్రం విడిచి పెట్టకుండా వాళ్ళకు ఎప్పటిలానే జీతాలు ఇస్తూ వచ్చానంది.చాలా కాలం తరువాత మళ్ళీ కష్టమర్స్ రాకతో పుంజుకున్నట్లు తెలిపింది. ఇప్పుడైతే.. యధావిధిగా ఎప్పటిలానే కొనసాగుతుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ చెప్పుకొచ్చింది.
 
అంతేకాదు కొత్తగా కేవలం సినిమా అండ్ రాజకీయ సెలబ్రిటీల కోసం ఒక యోగా సెంటర్ ని కూడా స్థాపించే ఆలోచనలో వుంది. దానికి సంబంధించి ఇప్పటికే మీటింగ్స్ కూడా అవుతున్నాయంట. నిరంతరం యోగా అండ్ జిమ్ అంటూ క్షణం తీరిక లేకుండా కసరత్తోలు చేస్తూ గడిపేస్తోంది రకుల్. ఆ ఫలితమే ఇప్పుడు రకుల్ వున్న స్లిమ్ పిట్ లుక్. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక లుక్ లో రకుల్ ని చూసిన అభిమానులు అండ్ నెటిజన్లు డెడికేషన్ అంటే రకుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.