టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం బాధాకరం. ఇప్పటికే హీరోలందరితో నటించేయడం వలన దర్శకులు రకుల్ కి బదులు మరో కొత్త కాంబినేషన్ కోసం చూస్తున్నారు.

ఈ క్రమంలో కొత్త హీరోయిన్లు అవకాశాలు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కార్తి, సూర్యలతో కలిసి సినిమాలు చేస్తోంది. అలానే హిందీలో అజయ్ దేవగన్ సరసన 'దేదే ప్యార్ దే' అనే సినిమాలో నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బాలీవుడ్ సినిమాలోలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. గతంలో రకుల్.. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'అయ్యారీ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కెరీర్ కి ఈ సినిమా ఏ విధంగానూ ప్లస్ కాలేకపోయింది.

అయితే సిద్ధార్థ్, రకుల్ పెయిర్ దర్శకుడు మిలప్ ఝవేరికి నచ్చడంతో అతడు రూపొందిస్తోన్న 'మర్ జవాన్' అనే సినిమాలో రకుల్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా మరోసారి సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ల జంటను చూడొచ్చు. ఈ సినిమా అమ్మడుకి ఎలా సక్సెస్ అందిస్తుందో చూడాలి!