Asianet News TeluguAsianet News Telugu

ఎమోషనల్ గా.. రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’ మూవీ టీజర్.. చూశారా?

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి (Rakshith Shetty)  లేటెస్ట్ ఫిల్మ్  ‘సప్త సాగరాలు దాటి’. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఎమోషనల్ గా సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంది.  
 

Rakshith shettys Sapta Sagaralu Dhaati Movie Teaser NSK
Author
First Published Sep 17, 2023, 12:02 AM IST

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి (Rakshith Shetty)  విభిన్నకథలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈయన ‘777 చార్లీ’తో రిజిస్టర్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందే ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ తో ఇక్కడి ఆడియెన్స్ ను పలకరించాడు. కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎమోషనల్ రైడ్ గా సాగిన 777 చార్లీ సినిమాతో చాలా పాపులారిటీ దక్కింది. 

ఇక రక్షిత్ శెట్టి నుంచి వస్తున్న మరో చిత్రమే ‘సప్త సాగరాలు దాటి : సైడ్ ఏ’ (Sapta Sagaralu Dhaati) . హేమంత్ దర్శకత్వం వహించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్. రక్షిత్ శెట్టి తన సొంత బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తోంది. ఇప్పటికే మొదటి పార్ట్ కన్నడలో సెప్టెంబర్ 1న విడుదలైన మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇదే నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. 

ఇదిలా  ఉంటే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘సప్త సాగరాలు దాటి’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చాలా ఫుల్ ఆఫ్ ఎమోషనల్ రైడ్ గా ఉంది.  గాయని ప్రియా, ఆటో డ్రైవర్ మను ప్రేమికులు. వీరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఆత్రుతలో ఓ మిస్టేక్ చేస్తారు. దాంతో చిక్కుల్లో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఒకరికొకరు సొంతం అయ్యారా? లేదా? అన్నది పూర్తి కన్సెప్ట్ గా తెలుస్తోంది. టీజర్ ను బట్టి బ్యూటీఫుల్ లవ్ స్టోరీని అందించబోతున్నారు. అలాగే మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఫుల్ ఎమోషనల్ గా సాగింది. సీన్లు, డైలాగ్ చాలా భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి. తప్పకుండా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. మొదటి పార్టు ఇక్కడ హిట్ అయితే..  ఇక రెండో పార్టును కన్నడ, తెలుగులో ఒకేసారి అక్టోబర్ 20న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios