బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన ఒకట్రెండు కమర్షియల్ సినిమాలు వర్కవుట్ అయినా హీరోగా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఈ ఏడాది 'సీత' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ని నిరాశ పరిచాడు.

అయితే ఇప్పుడు 'రాక్షసుడు' అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో సూపర్ హిట్ అయితే 'రాచ్చసన్' సినిమాను 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేశారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. 

శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాకముందే అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసిన వారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా అమెరికాలో జనాలకు బాగానే నచ్చింది.

గత సినిమాలతో పోలిస్తే బెల్లంకొండ ఈ సినిమాతో ఆకట్టుకున్నాడట. సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే అని చెబుతున్నారు. రేసీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని అందించారట. జిబ్రాన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచిందట. ఓవరాల్ గా చూసుకుంటే  సినిమా మంచి హిట్ అందుకుందని చెబుతున్నారు.