యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రాక్షసుడు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ రీమేక్. రాక్షసుడు చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఉత్కంఠ రేకెత్తించే ఈ సైకో థ్రిల్లర్ చిత్రాన్ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు. 

రాక్షసుడు చిత్రానికి సినీ విశ్లేషకులు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. కానీ వసూళ్లు మాత్రం చిత్ర యూనిట్ ని కంగారు పెట్టించే విధంగా ఉన్నాయి. రాక్షసుడు చిత్రంపై బెల్లకొండ శ్రీనివాస్ గత చిత్రాల ప్రభావం చాలా పడింది. ఈ ఏడాది విడుదలైం సీత చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనితో రాక్షసుడు చిత్రానికి తొలి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. 

రాక్షసుడు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.3 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 16 కోట్లు. ఇక శనివారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాక్షసుడు చిత్రం 1.59 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో రాక్షసుడు షేర్ ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లు దాటింది. 

పెరుగుతున్న పాజిటివ్ టాక్ తో ఆదివారం రోజు వసూళ్లు బలంగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాక్షసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావడానికి ఉన్న ఒక్క అవకాశం ఆదివారం. సోమవారం నుంచి వసూళ్లు నార్మల్ గా ఉండే అవకాశం ఉంది. వచ్చే వారం బాక్సాఫీస్ వద్ద మన్మథుడు 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాక్షసుడు పూర్తిస్థాయిలో వసూళ్లు రాబట్టి గట్టెక్కుతుందా అనే టెన్షన్ చిత్ర యూనిట్ లో నెలకొని ఉంది.