ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన వివాదాస్పద నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాఖీ సావంత్ కు సంబంధించిన ఓ వార్తగా క్షణాల్లో వైరల్ అయిపోయింది. రాఖీ సావంత్ సోమవారం రోజు రహస్యంగా వివాహం చేసుకుందట. ఓ హోటల్ గదిలో ఆమె వివాహం కేవలం 5 గురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. 

చాలా సీక్రెట్ గా రాఖీ సావంత్ వివాహం జరిగిందని.. ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి ఓ ఎన్నారై అంటూ వార్తలు వచ్చాయి. తన మ్యారేజ్ గురించి వస్తున్న అవాస్తవమైన వార్తలు వైరల్ అవుతుండడంతో రాఖీ సావంత్ స్పందించింది. తను వివాహం జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. 

ఓ ఫోటో షూట్ లో భాగంగా పెళ్లి దుస్తులు ధరించా. ఫోటో షూట్ హోటల్ గదిలో జరిగింది. తాను ఫోటో షూట్ చేసిన పిక్స్ ఇవే అంటూ రాఖీ సావంత్ బ్రైడల్ లుక్ లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. నాకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీగానే ఉన్నా. ఇలాంటి పుకార్లు ఎందుకు సృష్టిస్తారో తెలియదు అంటూ రాఖీ సావంత్ మండిపడింది.