బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖి సావంత్ కి సంబందించిన ఇష్యు మరోసారి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కలాల్ ని ఢిల్లీ రోడ్డు మీద కొట్టడం అందరిని షాక్ కి గురి చేసింది. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమెడియన్ కలాల్ పై కావాలనే ఈ దాడి చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఓ రియాలిటీ షోకి సంబందించిన కార్యక్రమం కోసం వెళ్లిన దీపక్ ను ప్రముఖ రాపర్ ఫజిల్ పురియా మేనేజర్ దీపక్ గురుగ్రామ్ రోడ్డు మీద ఆపి కలల్ ను చితకబాదాడు. అంతే కాకుండా కలాల్ సోషల్ మీడియాలో లైవ్ లో విషయాన్నీ చెబుతుండగా దీపక్ కలుగచేసుకొని అతన్ని కొట్టాడు. అతని(దీపక్ కలాల్) కామెడీ జోకులు వల్గర్ గా ఉంటాయని కొన్ని వర్గాలను కించపరిచేలా ఉంటాయని దీపక్ ఆరోపణలు చేశారు. 

అయితే ఈ వీడియోను పలువురు నెటిజన్స్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అయితే పలువురు ఈ విషయాన్నీ కామెడీగా చూస్తూ సెటైర్లు వేయడం గమనార్హం. దీపక్ కలాల్ - రాఖి సావంత్ గత ఏడాది నవంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.