బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ, దీపిక పదుకొన్ వంటి తారలు వివాహం చేసుకున్నారు. త్వరలోనే ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

తన పెళ్లి కార్డ్ ని సోషల్ మీడియాలో పెట్టి షాక్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరా..? అని తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు. కార్డ్ లో ఉన్న వివరాల ప్రకారం ఆమె దీపక్ కలాల్ ను వివాహం చేసుకోబోతుంది. 'ఇండియా గాట్ టాలెంట్' లో దీపక్ కనిపిస్తున్నారు.

మరోపక్క దీపక్ కూడా ఈ పెళ్లి కార్డ్ ను షేర్ చేస్తూ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుంది అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాఖీ చెప్పిన వివరాల ప్రకారం డిసంబర్ 31న వీరి వివాహం లాజ్ ఏంజిల్స్ లో జరగనుంది.

అయితే ఇది విన్న వారంతా రాఖీ కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే స్వయంవరం నిర్వహించి ఎవరినీ పెళ్లి చేసుకోకుండా  తప్పించుకుంది రాఖీ. ఇప్పుడు కూడా అలానే చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.