కండోమ్ పెట్టిన చిచ్చు.. ఇద్దరు నటీమణుల గొడవ!

rakhi sawant abuses tv actress mahika
Highlights

ఒక్కోసారి సరదా అనుకొని చేసే కామెంట్స్ కాస్త వివాదాలకు దారి తీస్తుంటాయి

ఒక్కోసారి సరదా అనుకొని చేసే కామెంట్స్ కాస్త వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా ఇద్దరు హీరోయిన్ల మధ్య కూడా సరదాగా సాగిన కన్వర్జేషన్ కాస్త సీరియస్ అయిపోయింది. ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించేవరకు ఈ వివాదం సాగింది.

అసలు విషయంలోకి వస్తే.. మహారాష్ట్రలో ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్ విధించారు. దీనిపై సీరియల్ నటి మహికా శర్మ.. రాఖీ సావంత్ ను ఉద్దేశిస్తూ ప్లాస్టిక్ బ్యాన్ పై అవగాహన పెంచుతావా..? కండోమ్ లు కూడా బ్యాన్ అయ్యాయా..? అంటూ సరదాగా ఓ కామెంట్ పెట్టింది. మహికా ఇలా ప్రశ్నించడం రాఖీకి రుచించక.. ఆమెను తిడుతూ కొని వీడియోలకు పోస్ట్ చేసింది. కండోమ్ ల గురించి నాకు ఐడియా ఉంది.

అవి ప్లాస్టిక్ తో కాకుండా రబ్బర్ తో తయారు చేస్తారు.. ఒకవేళ అవి గనుక బ్యాన్ చేస్తే.. మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారు అంటూ ఘాటుగా స్పందించింది రాఖీ. సరదాగా పోస్ట్ పెడితే రాఖీ ఇంతగా అవమానిస్తుందా అంటూ మహికా కూడా ఆమెపై విరుచుకుపడింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కామెంట్లు చేసేప్పుడే జాగ్రత్త పడితే సరిపోయే దానికి ఇంతవరకు తెచ్చుకుంటున్నారు నేటి తారలు. 
 

loader