ఫోన్ వస్తే ఇంకో పెగ్గు ఎక్స్ట్రా.. ఫ్యామిలిలో అకాల మరణాలతో రాకేష్ మాస్టర్ జీవితం నరకం

కొరియోగ్రాఫర్ గా ఎంతో ప్రతిభావంతుడుడైన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎలా ఎందుకు అయింది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాకేష్ మాస్టర్ మద్యానికి బానిసయ్యాడని, మతిస్థితిమితం కోల్పోయాడని అనేక రూమర్స్ ఉన్నాయి.

Rakesh Master losts his family memeber at early dtr

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ వడదెబ్బకి గురయ్యారు. ఆల్రెడీ రాకేష్ మాస్టర్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనితో వడదెబ్బ తగలడంతో రాకేష్ మాస్టర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

అయితే కొరియోగ్రాఫర్ గా ఎంతో ప్రతిభావంతుడుడైన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎలా ఎందుకు అయింది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాకేష్ మాస్టర్ మద్యానికి బానిసయ్యాడని, మతిస్థితిమితం కోల్పోయాడని అనేక రూమర్స్ ఉన్నాయి. కానీ తన గుండె లోతుల్లో ఉన్న బాధని రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. 

Rakesh Master losts his family memeber at early dtr

నా అనుకున్న వాళ్ళు వరుసగా దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో కన్నీరు పెట్టుకుంటూ తెలిపారు. నరకంలాగా ఉంటుందని భరించలేం అని అన్నారు. తన ఫ్యామిలిలో జరిగిన అకాల మరణాల వల్ల తాను మద్యానికి ఎక్కువగా బానిసైనట్లు రాకేష్ మాస్టర్ తెలిపారు. మా తమ్ముడు చనిపోయాడు , ఆ తర్వాత మా అమ్మగారు మరణించారు, వెంటనే నేను ప్రేమగా చూసుకున్న మా అక్క కొడుకు మరణించారు. ఆ తర్వాత నాన్న.. ఇలా ఒక్కొక్కరు నన్ను విడిచి వెళుతుంటే జీవితం మీదే విరక్తి వచ్చింది. 

ఫోన్ వస్తే వణికిపోయేవాడిని, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంతో ఒక పెగ్గు ఎక్కువగా తాగేవాడిని. నా అనే వాళ్లంతా దూరం అయ్యారనే భాద వెంటండుతూనే ఉంది. ఇక తన భార్య పిల్లలు తనతో లేరు అని రాకేష్ మాస్టర్ అన్నారు. నా వల్ల వారికి ఇబ్బంది ఉండకూడదనే దూరంగా ఉంటున్నట్లు రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇప్పుడు ఆయన మరణించడంతో టాలీవుడ్ మొత్తం విషాదం నెలకొంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios