Asianet News TeluguAsianet News Telugu

"రాజు గారి గది 2" మూవీ రివ్యూ, రేటింగ్

  • చిత్రం : రాజు గారి గది 2
  • జానర్ : కామెడీ హారర్
  • నటీ నటులు : నాగార్జున, సమంత,సీరత్ కపూర్, వెన్నెల కిషోర్,ప్రవీణ్ తదితరులు
  •  మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
  • ప్రొడక్షన్ : పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్
  • నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి
  • స్క్రీన్ ప్లే,దర్శకత్వం : ఓంకార్
  • ఆసియానెట్ రేటింగ్: 3/5
raju gari gadi 2 movie review

నాగార్జున కథానాయకుడిగా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఓంకార్ దర్శకత్వం లో  తెరకెక్కిన చిత్రం ‘రాజు గారి గది-2’ . పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రం మలయాళ హారర్ సినిమా "ప్రేతమ్" కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి రీమేక్ చేశారు.  నాగార్జున తొలి సారిగా మెంటలిస్ట్(మంత్రగాడిగా) పాత్రలో నటించిన ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్రలో నటించింది. మరి అక్కినేని కుటుంబంలో సమంత అడుగుపెట్టాక తొలిసారిగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..

కథ:

అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఎప్పటికీ తమ స్నేహం అలాగే ఉండాలని ఆలోచనతో ముగ్గురు కలిసి ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఓ బిజినెస్ మొదలు పెడతారు. విశాఖపట్నం బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది.

దెయ్యం పని పట్టేందుకు దగ్గరలోని చర్చి ఫాదర్ ను కలిస్తే ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు వచ్చిన రుద్ర.. అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ రిసార్ట్ లో తిరుగుతుందని, ఏవో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆ ఆత్మ ప్రయత్నిస్తుందని కనిపెడతాడు. అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

* సినిమాలో నాగార్జున మానసిక వైద్యుడిగా చేసి అదరగొట్టాడు.

* వెన్నెలకిషోర్, అశ్విన్, షకలక శంకర్ ల కామెడీ బాగుంది.

* ఓంకార్ డైరెక్షన్ ఆకట్టుకుంది. కాకపోతే రాజాగారి గది ఛాయలు చాల వరకు కనిపించాయి.

* ఆత్మ గా సమంత ఆకట్టుకుంది., సీరత్ కపూర్ గ్లామర్ తో యూత్ ను ఫిదా చేసింది.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఓవరాల్ గా సినిమా అంతా కామెడీ తో సాగిపోయింది. ప్రేక్షకులకు మంచి వినోదం ఖాయం.

నటీటనటులు:

హీరో నాగార్జున రాజు గారి గది 2తో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే నాగ్, ఈ సినిమాలో మెంటలిస్ట్ రుద్ర పాత్రలో మెప్పించారు. మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది.

సాంకేతిక నిపుణులు:

రాజుగారి గది సినిమాతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఓంకార్, రెండో సినిమాతో మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్ స్టార్స్ ఉన్న కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కలిసొచ్చింది. మలయాళ సినిమా నుంచి మూలకథను తీసుకున్న ఓంకార్, పూర్తిగా కొత్త టేకింగ్ తో మెప్పించాడు. ఎక్కవగా ఇది రీమేక్ అన్న ఆలోచన రానంతగా మన నేటివిటికీ తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న సమంత నుంచి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ రాబట్టడంలో ఓంకార్ విజయం సాధించాడు. సినిమాకు మరో ఎసెట్ తమన్ అందించిన సంగీతం, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాలో బిట్స్ సాంగ్స్ తో అలరించాడు. ఇక తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దివాకరన్ సినిమాటోగ్రఫి హర్రర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకువచ్చింది.  పీవీపీ సినిమా నిర్మాణలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

నాగార్జున, సమంతల నటన
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ లోని కొన్ని అనవసరమైన సీన్స్

చివరగా: 

రాజుగారి గది2 ఫ్యామిలీ అందరికీ వినోదం పంచే కామెడీ హారర్

 

Follow Us:
Download App:
  • android
  • ios