Asianet News TeluguAsianet News Telugu

రాజుగారి గది2 ఫస్ట్ డే కలెక్షన్స్

  • నాగార్జున, సమంతల కాంబినేషన్ లో రాజుగారి గది2
  • ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు
  • తొలిరోజు 5 కోట్ల పైగా వసూళ్లు సాధించిన రాజుగారిగది2
raju gari gadi 2 first day collections

దసరా సీజన్ లో వచ్చిన ‘జై లవకుశ’,‘స్పైడర్’,‘మహానుభావుడు’ వంటి సినిమాల హడావుడి తగ్గుముఖం పట్టి నేపథ్యంలో శుక్రవారం నాగార్జున హారర్ ఎంటర్‌టైన్ ప్రేక్షకులను పలకరించింది. క్లాస్, మాస్ తేడా లేకుండా హారర్ సినిమాలను ఇష్టపడతారు. అందులోనూ నాగార్జున వంటి స్టార్ హీరో ఈ సినిమాలో నటించడం. సమంత కూడా తోడవ్వడం. రాజుగారిగది అనే హిట్ సినిమాకు సీక్వెల్ గా రావడం... ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలుగా నిలిచాయి.



అందుకు తగ్గుట్టుగా ఈ సినిమా ఫస్ట్ డే న ఐదు కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకున్నట్టుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి.. రాజుగారిగది-2కి ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


 

పాజిటివ్ రివ్యూలు, టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వీకెండ్ లో కూడా రాజుగారి గది-2 సక్సెస్ ఫుల్ గా వసూళ్లను సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ మార్కెట్ లో ఈ సినిమా అంత ఎక్కువ కాకుండా, అంత తక్కువా కాకుండా వ్యాపారాన్ని చేసింది. హారర్ సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ.. పాజిటివ్ బజ్ తో ఈ సినిమా మంచి స్థాయిలో వసూళ్లను రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారంలో ‘రాజా ది గ్రేట్’ ‘రాజుగారి గది-2’కి పోటీగా రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios