MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Garividi Lakshmi : పికిలి పిట్టకు పీక సన్నము, ఉర్ల భామకు ఉరకలందము... ఈ పాట అర్థం ఇదే!

Garividi Lakshmi : పికిలి పిట్టకు పీక సన్నము, ఉర్ల భామకు ఉరకలందము... ఈ పాట అర్థం ఇదే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పికిలిపిట్టకు పీక సన్నము’ అంటూ హుషారుగా సాగే సినిమా పాట ట్రెండ్ అవుతోంది. దీనిపై తెలుగు యువత తెగ రీల్స్ చేస్తోంది… మరి దీని అర్థం ఏమిటో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 19 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పికిలి పిట్టకు సాంగ్ మీనింగ్
Image Credit : Asianet News

పికిలి పిట్టకు సాంగ్ మీనింగ్

తెలుగు జానపద పాటలకు ఉండే ప్రత్యేకతే వేరు. వినసొంపైన పదాలు, చమత్కారమైన పోలికలు, గ్రామీణ యాస, లయబద్ధమైన పదాల కలయికతో కొన్ని పాటలు శ్రోతలను వెంటనే ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నేపథ్యంలో వచ్చిన ‘గరివిడి లక్మి’ సినిమాలోని ‘పికిలి పిట్టకు పీక సన్నము.. ఉర్ల భామకు ఉరకలందము..’ అంటూ సాగే పాట కూడా ఇలాంటి ఆసక్తినే రేకెత్తిస్తోంది. ఈ పాటలోని పదాలు, వాటి వెనుక ఉన్న భావం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అసలు ఈ పాట ఏం చెబుతోంది? ఇందులోని పోలికలకు అర్థం ఏమిటి? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పికిలిపిట్టకు పీక సన్నము...
Image Credit : Asianet News

పికిలిపిట్టకు పీక సన్నము...

ఈ వాక్యంలో పికిలి పిట్టను ఉదాహరణగా తీసుకుని, దాని పీక సన్నగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ‘పీక’ అంటే మెడ లేదా గొంతు భాగాన్ని సూచించే మాటగా అర్థం చేసుకోవచ్చు. ‘సన్నము’ అంటే సన్నగా ఉండటం. అంటే పక్షి శరీర నిర్మాణంలోని ఒక ప్రత్యేక లక్షణాన్ని చమత్కారంగా చెప్పినట్లుగా ఈ వాక్యం కనిపిస్తుంది.

ఉర్ల భామకు ఉరకలందము...

ఈ పంక్తిలో ‘ఉర్ల భామ’ అనే పదప్రయోగం ఆసక్తిని కలిగిస్తోంది. ‘భామ’ అనే పదాన్ని సాధారణంగా అందమైన యువతిని అని అర్థం. ‘ఉరకలు’ అంటే ఎగరడం, గంతులు వేయడం లేదా వేగంగా కదలడం వంటి అర్థాలు సందర్భాన్ని బట్టి వస్తాయి. ‘అందము’ అంటే అందం. అంటే చలాకీగా ఉండే అమ్మాయి అని అర్థం.

నాగుబాముకు నడకలందము...

ఈ పంక్తిలో నాగుపామును పోలికగా తీసుకుంటారు. పాము కదిలే తీరు, నేలపై మెలికలు తిరుగుతూ సాగిపోయే విధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ కదలికను అందంగా వర్ణించే ప్రయత్నం ఈ పంక్తిలో కనిపిస్తుంది. ప్రకృతిలోని జీవుల ప్రత్యేక లక్షణాలను గుర్తించి, వాటిని అందంతో ముడిపెట్టడం జానపద పాటల్లో కనిపించే ఒక శైలి.

34
ఆడదానికి అలకలే అందం!
Image Credit : Asianet News

ఆడదానికి అలకలే అందం!

ఈ పాటలో అత్యంత సులభంగా అర్థమయ్యే పంక్తుల్లో ‘ఆడదానికి అలకలందము’ ఒకటి. సాధారణంగా ప్రేమలోనో, చనువున్న సంబంధాల్లోనో అలక అనేది సహజమైన భావప్రకటనగా కనిపిస్తుంది. ఇష్టమైన వ్యక్తిపై కోపం వచ్చినప్పుడు ముఖం తిప్పుకోవడం, మాట్లాడకుండా ఉండటం, తన అసంతృప్తిని ప్రత్యేకంగా వ్యక్తం చేయడం వంటి ప్రవర్తనను అలక అంటారు.

ఈ పంక్తి స్త్రీ అలకను ఒక ఆకర్షణీయమైన భావంగా వర్ణిస్తోంది. అంటే అందం అనేది కేవలం రూపానికి మాత్రమే సంబంధించినది కాదని, వ్యక్తి ప్రవర్తనలోనూ, భావాలను వ్యక్తం చేసే తీరులోనూ కనిపిస్తుందని చెప్పే చమత్కారమైన ప్రయోగంగా దీన్ని చూడవచ్చు.

గాజులు గల్లాడకుండ... గంధము తెగ రాలకుండ..

ఈ పంక్తులు పాటకు మరింత దృశ్యాత్మకమైన రూపాన్ని ఇస్తాయి. గాజులు స్త్రీల అలంకరణలో ముఖ్యమైన భాగం. చేతులు కదిలినప్పుడు గాజుల నుంచి వచ్చే శబ్దం జానపద గీతాల్లో తరచుగా వినిపిస్తుంది. అలాగే గంధం శరీరానికి సువాసనను అందించే అలంకరణ వస్తువు. ఇదికూడా అందాన్ని వర్ణించే పదప్రయోగమే.

‘వద్దనడు తగ్గకుండ’ అనే మాటలోని భావం

‘వద్దనడు తగ్గకుండ’ అనే పదబంధం పాటలోని భావాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ మాటలను సాధారణంగా చూస్తే నిరాకరణకు వెనక్కి తగ్గకపోవడం లేదా తన వైఖరిని కొనసాగించడం వంటి భావాలు గుర్తుకు వస్తాయి. ఇక్కడ మాత్రం వద్దని వెనక్కి తగ్గకపోవడం అని అర్థం.

‘తాకిటతక.. తకిడనికిడి’ పదాలకు అర్థం ఉందా?

పాట చివర్లో వచ్చే ‘తాకిటతక’, ‘జేకిటతక’, ‘తకిడనికిడి’, ‘నెకిడనకిడి’ వంటి పదాలు సాధారణ సంభాషణలో ఉపయోగించే పదాలు కావు. ఇవి సంగీతంలో లయను, తాళాన్ని సూచించే శబ్ద ప్రయోగాలు. సంగీతంలో ఇటువంటి అక్షరాలను ఉపయోగించడం ద్వారా పాటకు వేగం, ఉత్సాహం, నృత్యానికి అనుకూలమైన లయను తీసుకొస్తారు. ఈ జానపద పాటలో కూడా ఇలాగే ఉపయోగించారు.

44
ఈ పాటలో అసలు భావం ఏంటి?
Image Credit : Asianet News

ఈ పాటలో అసలు భావం ఏంటి?

పికిలి పిట్టకు పీక సన్నము..

ఉర్ల భామకు ఉరకలందము..

నాగుబాముకు నడకలందము...

ఆడదానికి అలకలందము..

గాజులు గల్లాడకుండ...

గంధము తెగ రాలకుండ..

వద్దనుడు తగ్గకుండ..

తాకిటతక… నేకిటతక...జేకిటతక..తాకిటతక..

తకిడనికిడ...నెకిడనకిడ..... తకిడనికిడ...నెకిడనకిడ.....

తకిడనికిడ...నెకిడనకిడ..... తకిడనికిడ...నెకిడనకిడ.....

ఈ పాటలో అమ్మాయి అందాన్ని వర్ణించే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తుంది. పికిలిపిట్టకు సన్నని మెడ అందం అయితే... చురుగ్గా ఉండే అమ్మాయలు ఎప్పుడూ హడావిడిగా ఉండటమే అందం... నాగుపాములు రింగురింగులు తిరుగుతూ నడవడం అందంగా ఉంటుందని అర్థం. ఇలాగే అమ్మాయిలు అలగడం అందంగా ఉంటుంది... అంటే అమ్మాయిల అలకముఖం అందంగా ఉంటుందని వర్ణించారు. ఈ పాటలో పదప్రయోగంపై అద్భుతంగా ఉంది... పాడుకునేందుకు గమ్మత్తుగా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Memes: జైలర్ 2 ట్రెండింగ్ మీమ్స్.. రజనీ మాస్ నుంచి నెల్సన్ కామెడీ దాకా సోషల్ మీడియాలో రచ్చ!
Recommended image2
Ranabaali: బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోన్న ‘రణబాలి’.. బతుకమ్మ వేడుకల్లో విజయ్‌ రష్మిక ఆటాపాటా
Recommended image3
Rajinikanth Fitness: 75 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ ఫుల్ యాక్టివ్.. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
Related Stories
Recommended image1
Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
Garividi Lakshmi 2 Days Collections: రెండో రోజు పుంజుకున్న గరివిడి లక్ష్మి.. అయినా దారుణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved