టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని చూసిన రాజ్ తరుణ్..మొదట్లో లఘు చిత్రాలు తీశాడు.  అందులో నటించాడు..ఇలా తన అనుభవంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూసిన మనోడికి అదృష్టం కలిసి వచ్చి ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరో చాన్స్ వచ్చింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా వరుస విజయం సాధించడంతో రాజ్ తరుణ్ మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడు. 

 

రాజ్ తరుణ్ నటించిన సినిమాలకు కూడా మంచి క్రేజ్ పెరిగింది.  ఈ మద్య ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’సినిమాలో  కుక్కల్ని ఎత్తుకుపోయే డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్న రాజ్ తరుణ్ ఈసారి క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు.  అయితే ఈ వ్యాది చాలా విచిత్రమైనది అతి కొద్ది మందికే వస్తుంది.  ఈ వ్యాది వచ్చిన వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు..ముఖ్యంగా సొసైటీలో ఎన్నో కష్టాలు పడుతుంటారు.

 

 

ఇదేంటీ రాజ్ తరుణ్ కి అంత పెద్ద వ్యాధి వచ్చిందని అనుకుంటున్నారా..! అబ్బే ఇది సినిమాలో..అవును రాజ్ తరుణ్ నటిస్తున్న ‘రాజుగాడు’ సినిమాలో రాజ్ తరుణ్ కి వింతైన వ్యాధి ఉంటుంది. అదేంటంటే..తనకు తెలియకుండా దొంగతనం చేసే అలవాటు. 

 

వినడానికి కాస్త వింతగా ఉండటంతో ఇదే పాయింట్‌‌ను బేస్ చేసుకుని ‘రాజుగాడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాజ్ తరుణ్. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ‘రాజుగాడు’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.ఏకె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌లో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 

‘రాజు గాడు’ చిత్రంతో సంజనా రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో రాజ్ తరుణ్ సరసన ‘మనసుకు నచ్చింది’ ఫేమ్ అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ సితార రాజ్ తరుణ్‌కు పేరెంట్స్‌గా నటిస్తున్నారు. నిన్ను కోరి ఫేం గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం మే 11న రిలీజ్ చేయబోతున్నారు.