శ్రీదేవిని చూడడానికి బయలుదేరిన రజనీకాంత్

శ్రీదేవిని చూడడానికి బయలుదేరిన రజనీకాంత్

బాలీవుడ్ తారాగణం మొత్తం ముంబైలోనే ఉంటుంది కాబట్టి శ్రీదేవి కడసారి చూపు కోసం నివాళి అర్పించడం కోసం ఎక్కువ దూరం వెళ్ళే అవసరం పడదు. కాని సౌత్ లో ఉన్న తమిళ్ - తెలుగు - మలయాళం పరిశ్రమల నుంచి వెళ్ళాలంటే మాత్రం కొంత ప్లానింగ్ తప్పదు. ఇప్పటి దాకా ఉన్న సమాచారం మేరకు ఒక్క రజనికాంత్ మాత్రమే నిన్న రాత్రి ముంబై చేరుకున్నారు. శ్రీదేవి నిర్జీవ శరీరం తెల్లవారుజామునే రావొచ్చు అనే ప్రాధమిక సమాచారం మేరకు ఆయన అక్కడ టైంకు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

శ్రీదేవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ వెళ్ళడం గురించి ఇంకా ఎటువంటి అప్ డేట్ లేదు. తన పొలిటికల్ టూర్ ముందే ప్లాన్ చేసిన నేపధ్యంలో దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరిగిపోయాయి కాబట్టి వెళ్ళడం గురించి ఇంకా సందిగ్దత నెలకొని ఉంది. ఇక చిరంజీవి నాగార్జున వెంకటేష్ తదితర హీరోలంతా అందుబాటులోనే ఉన్నారు. వీరు వెళ్ళే దాని గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. తెలుగులో శ్రీదేవి నటించిన అధిక సినిమాల్లో హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెళ్ళాలని ఉన్నా అది సాధ్యం కాకపోవచ్చు. మరి తన ప్రతినిధిగా మహేష్ ని పంపుతారో లేదో చూడాలి. మధ్యాన్నం సందర్శన మొదలయ్యకే ఎవరు వస్తున్నారు అనే దాని గురించి క్లారిటీ వస్తుంది.

చెప్పకుండా ఎవరైనా వస్తున్నరేమో అని అనుకోవడానికి లేదు. కారణం ముంబై ఎయిర్ పోర్ట్ లో మీడియా నిన్నటి నుంచే అక్కడ 24/7 ప్రాతిపాదికన కాపు కాచి ఉంది. వాళ్ళ కన్ను గప్పి ముంబైలో ఏ సెలబ్రిటీ తప్పించుకోలేరు. సో ఇప్పటి దాకా ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే రజని మాత్రమే శ్రీదేవి కడచూపు కోసం అక్కడ ఉన్నారు. మరికొంత సమయం గడిచాక ఇంకా ఎవరెవరు వస్తారో వేచి చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page