ప్రేయసిని మ్యారేజ్‌ చేసుకున్న రాజ్‌కుమార్‌ రావు.. గ్రాండ్‌గా పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్‌

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్ రావు మ్యారేజ్‌ చేసుకున్నాడు. తన చిరకాల ఫ్రెండ్‌, లవర్‌ని మూడుముళ్లతో తన వశం చేసుకున్నాడు. సోమవారం చండీఘడ్‌లో ఆయన వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. 

rajkumar rao marriage with his long term lover patralekhaa

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు(Rajkumar Rao) ఓ ఇంటి వాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి పత్రలేఖ(Patralekhaa)ని వివాహం చేసుకున్నారు. మూడు ముళ్ల బందంతో ఒక్కటయ్యారు. సోమవారం నవంబర్‌ 15న ఇద్దరు ఏడడుగులు వేశారు. చండీగఢ్‌ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య రాజ్‌కుమార్‌ రావు, పత్రలేఖల వెడ్డింగ్‌ (Rajkumar Rao Wedding With Patralekhaa) గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ రావు, పత్రలేఖలు తమ వివాహ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 

రాజ్‌ కుమార్‌ తన భార్య పత్రలేఖ నుదుటున కుంకుమ దిద్దుతున్న ఫోటోను షేర్‌ చేస్తూ.. `11 సంవత్సరాల ప్రేమ, స్నేహం, వినోదం తరువాత చివరికి ఈ రోజు నా సర్వస్వం, నా సోల్‌మెట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నా. ఈ రోజు పత్రలేఖ నుంచి భర్తగా పిలిపించుకోవడంకంటే గొప్ప ఆనందం మరొకటి లేదు` అనే పేర్కొన్నాడు రాజ్‌కుమార్‌ రావు.  ఈ ఫోటోలనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  రాజ్‌ కుమార్‌ రావు, ప్రతలేఖ దాదాపు పదేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. నూతన జంటకు బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రియాంక చోప్రా, తాప్సీ, ఆయుష్మాన్‌ ఖురానా వంటి వారికి మ్యారేజ్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇక రాజ్‌కుమార్‌ రావు మంచి నటుడిగా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. హర్యానాకి చెందిన రాజ్‌కుమార్‌రావు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్ చేశారు. ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో నటనలో శిక్షణ పొందారు. `లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోఖా` చిత్రంతో హీరోగా బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. `గ్యాంగ్స్ ఆఫ్‌ వస్సేపూర్‌-పార్ట్ 2`, `తలాష్‌`, `కాయి పో చె` చిత్రాలతో ఆకట్టుకున్నారు. `షాహిద్‌` చిత్రానికి ఆయన ఏకంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. 

`క్వీన్‌`, `సిటీలైట్స్`, `అలిఘరా`, `ట్రాప్డ్`, `రాబ్తా`, `బేరిల్లీ కి బర్ఫీ`, `న్యూటన్‌`, `ఫన్నీ ఖాన్‌`, `స్ట్రీ`, `అమోలి`, `జడ్జ్ మెంట్‌ హై క్యా`, `సిమ్లా మిర్చీ`, `లుడో`, `ఛలాంగ్‌`, `ది వైట్‌ టైగర్‌`, `హమ్‌ దో హమారే దో` చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావు `బధాయి దో`, `మోనికా, ఓ మై డార్లింగ్`, `హిట్‌ః ది ఫస్ట్ కేస్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. `హిట్‌` తెలుగులో సక్సెస్‌ అయిన చిత్రానికి రీమేక్‌. 

also read: వివాదాల్లో `జై భీమ్‌`.. సూర్యని కొడితే లక్ష రూపాయల ఆఫర్‌.. దుమారం..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios