చరణ్ త్వరలో చాలామంది బాలీవుడ్ దర్శకులతో వర్క్ చేయబోతున్నట్లు ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సందేశాత్మక చిత్రాలతో గుర్తింపు పొందిన స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత అదే స్థాయిలో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందులో భాగంగానే సౌత్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే చరణ్ త్వరలో చాలామంది బాలీవుడ్ దర్శకులతో వర్క్ చేయబోతున్నట్లు ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 

ఈ క్రమంలో సందేశాత్మక చిత్రాలతో గుర్తింపు పొందిన స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. రాజ్ కుమార్ హిరానీ రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో డంకి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ రాజ్ కుమార్ హిరానీ స్థాయిలో కాకున్నా పర్వాలేదనిపించే విధంగా రాణిస్తోంది. 

Scroll to load tweet…

తాజాగా రాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా రాంచరణ్ తో సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. రాంచరణ్ తో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి నిజమా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను కూడా ఆ వార్తలు చూశాను. నాకు రాంచరణ్ తెలుసు. కానీ కలసి చాలా కాలం అవుతోంది. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అద్భుతంగా నటించారు. అయితే నేను చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. 

నాకు కూడా చరణ్ తో సినిమా చేయాలని ఉంది కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదు అంటూ రాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చేశారు.