జూ.ఎన్టీఆర్ తో ఫ్రెండ్ షిప్ పై రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇంతకుముందులా లేదు, కానీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఎన్టీఆర్ చిత్రాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఆ ఈ మధ్యన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని.. దూరం పెరిగిందని చాలా రూమర్స్ వచ్చాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఎన్టీఆర్ చిత్రాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఆ ఈ మధ్యన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని.. దూరం పెరిగిందని చాలా రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ పై తాజా ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల స్పందించారు.
ఎన్టీఆర్ తో ఇప్పటికి స్నేహం అలాగే ఉంది. కానీ మేమిద్దరం కలుసుకోవడం తగ్గింది అంతే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసే రోల్ లో నేనే నటించా. అది అందరికి తెలుసు. కాకపోతే గతంలో మేమిద్దరం కలుసుకునేందుకు ఎక్కువ టైం ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ బాగా బిజీగా మారారు, ఆయనకి కమిట్మెంట్స్ ఎక్కువయ్యాయి. నాకు కూడా భాద్యతలు ఉన్నాయి. కాబట్టి తరచుగా కలుసుకోవడం కుదరడం లేదు.
ఇటీవల కూడా తాను నటిస్తున్న చిత్ర షూటింగ్ కి ఒకసారి రమ్మని తారక్ కాల్ చేశాడు. అయితే నాకు వీలు కుదరక ఇంకా వెళ్ళలేదు. తప్పకుండా ఒకసారి వెళతాను అని రాజీవ్ అన్నారు.
తారక్ కాకుండా తనకి హీరో తరుణ్, మనోజ్, శివబాలాజీలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని తెలిపారు. తరుణ్ కి ఇప్పటికి మంచి క్రేజ్ ఉంది. తరుణ్ తలచుకుంటే ఇప్పుడైనా రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ ఎందుకనో చేయడం లేదు. నా కెరీర్ విషయానికి వస్తే గతంలో నాకు ఒకే తరహా పాత్రలు వచ్చేవి. ఇప్పుడు ట్రెండుకి తగ్గట్లుగా విభిన్నమైన రోల్స్ వస్తున్నాయి అని రాజీవ్ కనకాల అన్నారు.