నటుడిగా రాజీవ్ కనకాల టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజీవ్ కనకాల మునుపటిలా ఎక్కువ చిత్రాలు చేయడం లేదు. కానీ అప్పుడప్పుడూ కొన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. తాజాగా రాజీవ్ కనకాల సూపర్ స్టార్ మహేష్ మహర్షి చిత్రంలో నటించాడు. రాజీవ్ కనకాల పాత్ర సెకండ్ హాఫ్ లో కీలకంగా సాగుతుంది. తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

జూ. ఎన్టీఆర్ నటించే పలు చిత్రాల్లో రాజీవ్ కనకాల కనిపిస్తుంటాడు. వీరిద్దరిమధ్య మంచి స్నేహం ఉందని ఇండస్ట్రీలో టాక్. కానీ అశోక్ చిత్రం తర్వాత విభేదాల కారణంగా ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలపై రాజీవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఇండస్ట్రీలో ఎవ్వరినీ వదులుకోను.. నన్ను దూరం పెట్టాలని భావిస్తే అది వారి ఇష్టం అని తెలిపాడు. ఎన్టీఆర్ కు, తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే అని తెలిపాడు. 

నాకు, ఎన్టీఆర్ కు విధేదాలు ఉంటే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో ఎందుకు నటిస్తాను అని రాజీవ్ కనకాల ప్రశ్నించాడు. అలాగని ఎన్టీఆర్ ప్రతి చిత్రంలో నేను నటించాలంటే కుదరదు. అది దర్శకుల ఛాయిస్ అని కనకాల తెలిపాడు. ఎన్టీఆర్ నాకన్నా వయసులో చిన్నవాడు. మా ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని రాజీవ్ కనకాల తెలిపాడు. 

స్టూడెంట్ నెం1 సమయంలో తనని మరిచిపోవద్దని చెప్పా. నిన్నుఎప్పటికీ మరచిపోను అని ఎన్టీఆర్ నాతో అన్నాడు. అప్పటి నుంచి స్నేహితులుగానే కొనసాగుతున్నట్లు కనకాల తెలిపాడు. కుటుంబ బాధ్యతల వలన మునుపటిలా తాము కలుసుకోలేకున్నాం అని రాజీవ్ కనకాల వెల్లడించాడు. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి