రజనీకాంత్‌, ఆయన చేతిలో ఓ చిన్నారి.. ఇప్పుడీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఆ చిన్నారి ఎవరనేది ఇప్పుడు ఆయన అభిమానుల మెదళ్ళని తొలుస్తుంది. రజనీకి చెందిన కూతుళ్ల మాదిరిగా లేరు, మరెవరూ.. అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దాన్ని వెతికే పనిలో రజనీ అభిమానులు బిజీగా అయ్యారు. 

ఇంతకి ఆ ఫోటోని పంచుకుంది ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌. దీంతో మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. అసలు విషయం వెల్లడైంది. రెహ్మానే ఈ విషయాన్ని వెల్లడించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహ్మాన్‌, ఆయన సతీమణి సైరాబానుకి 1997లో వివాహమైంది. వీరికి రహీమా అనే అమ్మాయి, అమీన్‌ అనే అబ్బాయి జన్మించారు. 

రజనీకాంత్‌ ఎత్తుకున్న చిన్నారి రెహ్మాన్‌ కూతురు రహీమా. రజనీకాంత్‌ 1999లో `పడయప్ప`(తెలుగులో నరసింహ) చిత్రంలో నటించారు. ఈ సినిమాకి రెహ్మాన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన కూతురిని ఎత్తుకుని రజనీ ఫోటో దిగారని, ఆ అరుదైన ఫోటోని తాను పంచుకున్నట్టు రెహ్మాన్‌ పేర్కొన్నారు. రజనీకాంత్‌ నటించిన అనేక చిత్రాలకు రెహ్మాన్‌ సంగీతం అందించారు. వీరి కాంబినేషన్‌లో అనేక సూపర్‌ హిట్‌ సాంగ్స్ వచ్చాయి. చివరగా `రోబో 2.0`కి కూడా రెహ్మాన్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే.