సూపర్‌ స్టార్‌ రజనీ అమెరికా వెళ్లబోతున్నారు. స్పెషల్‌ ఫ్లైట్‌లో ఆయన యూఎస్‌ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అమెరికాలో రజనీ తన ఆరోగ్యానికి సంబంధించిన రెగ్యూలర్‌ మెడికల్‌ చెకప్‌ చేసుకోబోతున్నారు.

సూపర్‌ స్టార్‌ రజనీ అమెరికా వెళ్లబోతున్నారు. స్పెషల్‌ ఫ్లైట్‌లో ఆయన యూఎస్‌ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అమెరికాలో రజనీ తన ఆరోగ్యానికి సంబంధించిన రెగ్యూలర్‌ మెడికల్‌ చెకప్‌ చేసుకోబోతున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రజనీ అమెరికా వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయగా, ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేసింది. 

రజనీకాంత్‌ తన ఆరోగ్యానికి సంబంధించి తరచూ అమెరికా వెళ్తుంటారు. వరల్డ్ క్లాస్‌ డాక్టర్ల ఆధ్వర్యంలో రజనీకి టెస్ట్ లు జరుగుతాయని తెలుస్తుంది. అయితే రజనీ స్పెషల్‌ ఫ్లైట్‌లో వెళ్లబోతున్నారు. ఇందులో 14 మంది వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. రజనీ తనతోపాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే రజనీ అల్లుడు, హీరో ధనుష్‌ తన ఫ్యామిలీతో కలిసి ఇప్పటికే అమెరికాలో ఉన్నారు. ఆయన హాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం కొన్ని రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. వీరింతా అక్కడ కలుసుకోనున్నారని సమాచారం.

హఠాత్తుగా రజినీకాంత్ అమెరికాకు వెళ్లడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయేమో అని కంగారుపడుతున్నారు. 

రజనీకాంత్‌ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కీర్తిసురేష్‌, నయనతార, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మేజర్‌ షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తి చేసిన విషయం తెలిసిందే.