మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీ కాంత్ ల మధ్య గాఢ స్నేహం రజినీ, మోహన్ బాబు ల పెద రాయుడు బ్లాక్ బస్టర్ హిట్ రజినీ అల్లుడు ధనుష్ తెరకెక్కించిన పవర్ పాండి సూపర్ హిట్ పవర్ పాండిని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకు సూచించిన రజినీ

సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మధ్య స్నేహం ఎంత బలమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల విషయంలోను ఈ ఇద్దరు ఒకరికొకరు పూర్తి సహాయ సహాకారాలు అందించుకుంటూ ఉంటారు.

వీరిద్దరి కాంబినేషన్ లో ఒకప్పుడు 'పెద్దరాయుడు' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాలో రజనీకాంత్ రోల్ లేకుండా ఊహించలేం. తన చిరకాల మిత్రుడు మోహన్ బాబు కోరిక మేరకు రజనీ మరో మాట లేకుండా ఈ సినిమాలో నటించేశారు.

ఇక ఇప్పుడు రజనీకాంత్ వంతు వచ్చింది. తాజాగా రజనీ అల్లుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'పవర్ పాండి' తమిళ్‌లో సూపర్ హిట్ అవడంతో.. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని మోహన్ బాబుకు సూపర్ స్టార్ రజనీ సూచించారట.

ఈ సినిమాను ప్రత్యేకంగా రజనీ కోసం 'షో' వేసిన సందర్బంగా మోహన్ బాబును కూడా పిలిపించారట. సినిమా ఆసాంతం ఎంతగానో ఆకట్టుకుందని అల్లుడు ధనుష్‌ను పొగడ్తల్లో ముంచెత్తిన రజనీ.. మరో పదేళ్ల వరకు ఇంకో సినిమా చేయకని కూడా చెప్పారట. ఎన్నో ఏళ్లపాటు నీ పేరు నిలబడిపోవడానికి ఈ ఒక్క సినిమా చాలని అన్నారట.

అదే సమయంలో పక్కనే ఉన్న మోహన్ బాబుతో 'పవర్ పాండి' రీమేక్ గురించి చర్చించారట రజనీ. తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయనకు సలహా ఇచ్చారట. చూడాలి మరి తన చిరకాల మిత్రుడు రజనీ సూచనను మోహన్ బాబు పాటిస్తారా లేదా చూడాలి.