సినీ కెరీర్ లో సక్సెస్ సాధించిన వారు చాలా మంది సొంత టాలెంట్ తో పైకొచ్చిన వారే. అయితే ఆ టాలెంట్ ను గుర్తించే వారే లేకుంటే ఏ స్టార్ కూడా ఉండడు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విషయాన్ని బలంగా ఒప్పుకునేవారిలో  సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. హీరోగా తాను ఈ స్థాయికి రావడానికి సీనియర్ నిర్మాత కళైజ్ఞానం అని చెబుతూ ఉంటారు. 

అయితే రీసెంట్ గా కళైజ్ఞానంకి జరిగిన సన్మాన సభలో సూపర్ స్టార్ నిర్మాతకు ఒక వాగ్దానం ఇచ్చారు. నిర్మాతగా ఎన్నో నష్టాలను చూసిన అయన సొంత ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని తెలుసుకున్న రజినీ ప్రభుత్వం సహాయం చేసేకంటే ముందే తాను తప్పకుండా ఆయనకు ఒక ఇల్లు కట్టించడానికి కృషి చేస్తానని అన్నారు. 

అదే విధంగా వీలైనంత త్వరగా ఒక పది రోజుల్లో సొంత ఇంటికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తానని రజిని చెప్పారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ కలైజ్ఞానం కోసం కోటి రూపాయల విలువగల ఇంటిని చూసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తన చేతుల మీదుగా ఇంటిని ఆయన పేరుమీదకు మార్చే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది.