బిగ్ బీని ఉద్దేశించి రజనీకాంత్ ఎగ్జైటింగ్ నోట్.. ఫస్ట్ టైమ్ ఇద్దరు అలా.. సంచలనాలకు రంగం సిద్ధం..
దాదాపు 33ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కలిసి నటించబోతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఓ తేడా ఉంది. అప్పట్లో బిగ్ బీ సినిమాలో రజనీకాంత్ నటించేవారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి పలు సినిమాల్లో నటించారు. చివరిసారిగా 1991లో `హమ్` అనే మూవీలో నటించారు. ఇది క్రిటికల్‌గా, కమర్షియల్‌గా పెద్ద హింట్ అయ్యింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతకు ముందు `అందా కానూన్`(1983), `గీరాఫ్తార్`(1985` చిత్రాలు చేశారు. ఈ మూవీస్ కూడా ఫర్వాలేదనిపించాయి.
ఇదిలా ఉంటే దాదాపు 33ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కలిసి నటించబోతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఓ తేడా ఉంది. అప్పట్లో బిగ్ బీ సినిమాలో రజనీకాంత్ నటించేవారు. ఈ ఇద్దరు చేసినవన్నీ హిందీ మూవీస్. కానీ ఇప్పుడు రజనీ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అవును.. `జై భీమ్` ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రస్తుతం `తలైవర్170` చిత్రం చేస్తున్నారు. ఇది భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. అమితాబ్ బచ్చన్‌తోపాటు తెలుగు నుంచి రానా, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్తోపాటు కోలీవుడ్ ఆర్టిస్టులు చేస్తున్నారు.
లైకా నిర్మించే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే తాజాగా అమితాబ్, రజనీకాంత్ కలుసుకున్నారు. `తలైవర్170`కోసం ఈఇద్దరు కలిశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు రజనీ. బిగ్ బీతో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ `33ఏళ్ల తర్వాత టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రాబోయే లైకా మూవీ `తలైవర్ 170`లో నా గురువు అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది` అని ట్వీట్ చేశారు రజనీ. ప్రస్తుతం ఈ పోస్ట్ పోస్టర్ వైరల్ అవుతుంది.
అమితాబ్ బచ్చన్ ఇటీవల సౌత్ సినిమాలు విరివిగా చేస్తున్నారు. `సైరా` నరసింహారెడ్డిలో చేశారు. ఇప్పుడు `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న ఆయన మరో సౌత్ మూవీ చేయడం విశేషం. ఈ సందర్బంగా ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ ఇటీవల `జైలర్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది ఆరు వందల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మరో సంచలనాలకు తెరలేపుతున్నారు.