గాయకుడు బాలసుబ్రమణ్యం, రజనీకాంత్‌కి విడదీయలేని బంధం ఉంది. ఎందుకంటే చాలా వరకు రజనీకాంత్‌ సినిమాలకు తెలుగులో ఆయన పాత్రలకి బాలు డబ్బింగ్‌ చెబుతుంటాడు. ఈ లెక్కన కమల్‌హాసనే కాదు, సూపర్‌ స్టార్‌ రజనీకి కూడా బాలునే గొంతుక. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలోకి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. 

కరోనా తీవ్ర కావడంతో బాలు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్ని ఐసీయుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. రెగ్యులర్‌ ట్రీట్‌మెంట్‌కి కరోనా నయం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్లాస్మా ద్వారా వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

మరోవైపు బాలు కోలుకోవాలని సినీతారలు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తమ సందేశాలను అందిస్తున్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, కమల్‌హాసన్‌ ఇలా అనేక మంది స్పందించారు. తాజాగా రజనీకాంత్‌ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అందులో తమిళంలో ఆయన చెబుతూ, బాలు త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాటలను కొనియాడారు. గెట్‌ వెట్‌ సూన్‌ బాలు సర్‌ అని ట్వీట్‌ చేశారు.