తలైవా భార్యకు విచారణ తప్పడం లేదు!

Rajinikanth's Wife Latha To Face Trial For Fraud
Highlights

12 వారాల్లో మొత్తం డబ్బు చెల్లించాలని సూచించింది. కానీ ఆమె చెల్లించకపోవడంతో కోర్టు ఆమెను మందలించింది. డబ్బు ఎప్పుడు చెల్లిస్తారని కోర్టు ఆమెను ప్రశ్నించింది. అయితే దీనికి ఆమె నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మంగళవారం ఆమె పోలీసుల విచారణ ఎదుర్కోవాలని సుప్రీమ్ కోర్టు పేర్కొంది

'కొచ్చాడయాన్' సినిమా కోసం రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ తమ వద్ద రూ.10కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారని.. సినిమా పూర్తయిన తరువాత సగం మాత్రమే తిరిగిచ్చారని బెంగుళూరుకి చెందిన 'యాడ్ బ్యూరో' అనే సంస్థ రజినీకాంత్ భార్యకు నోటీసులు జారీ చేసింది.

ఈ సినిమా పంపిణీ హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ కు అప్పగించడంతో తాము ఆర్థికంగా నష్టపోయామంటూ సదరు సంస్థ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మిగిలిన బకాయిలు చెల్లించాలని సుప్రీమ్ కోర్టు లతా రజినీకాంత్ ను ఆదేశించింది. 12 వారాల్లో మొత్తం డబ్బు చెల్లించాలని సూచించింది. కానీ ఆమె చెల్లించకపోవడంతో కోర్టు ఆమెను మందలించింది.

డబ్బు ఎప్పుడు చెల్లిస్తారని కోర్టు ఆమెను ప్రశ్నించింది. అయితే దీనికి ఆమె నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మంగళవారం ఆమె పోలీసుల విచారణ ఎదుర్కోవాలని సుప్రీమ్ కోర్టు పేర్కొంది. మరి ఈ కేసు నుండి ఆమె ఎప్పుడు బయటపడుతుందో చూడాలి!  

loader